India A leapfrog Pakistan A in ACC Mens Emerging Asia Cup 2023: ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎమర్జింగ్ కప్ క్రికెట్ టోర్నీలో భారత్-ఎ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూప్-బిలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో నేపాల్‌పై ఘన విజయం సాధించింది. వరుసగా రెండు వన్డేల్లో గెలిచిన యువ భారత్.. గ్రూప్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీస్‌కు అర్హత సాధించింది. చివరి గ్రూప్ మ్యాచ్‌లో భారత్ బుధవారం పాకిస్థాన్-ఎతో తలపడుతుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 39.2 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ రోహిత్ పాడెల్ (65; 85 బంతుల్లో 7 ఫోర్లు) అర్ధ శతకంతో ఒంటరి పోరాటం చేశాడు. గుల్షన్ జా (38) కీలక పరుగులు చేశాడు. భారత స్పిన్నర్ నిశాంత్ సింధు (4/14).. పేసర్లు రాజ్యవర్ధన్ హంగార్గేకర్ (3/25), హర్షిత్ రాణా (2/16) అద్భుత ప్రదర్శనతో నేపాల్ బ్యాటర్లను అడ్డుకున్నారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్-ఎ 22.1 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 172 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ ( 87; 69 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), సాయి సుదర్శన్ (58 నాటౌట్; 52 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో సత్తా చాటారు. అభిషేక్ ఔటైనా ధ్రువ్ జూరెల్ (21 నాటౌట్; 12 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. సిక్సర్‌తో మ్యాచ్ ముగించాడు.
India A beat UAE A by 8 wickets in the first match of Emerging Asia Cup 2023 to move top of the points table.
Hundred by Captain Yash Dhull & 4 wickets by Harshit Rana are the heroes. pic.twitter.com/3yc9sbbfBa
— Johns. (@CricCrazyJohns) July 14, 2023