India challenges 2026: 2026 కొత్త సంవత్సరం భారత్‌లో ఎన్నో ఆశతో ప్రారంభమైంది. అదే టైంలో ఈ నూతన సంవత్సరం గణనీయమైన సవాళ్లతో కూడా ప్రారంభమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సంవత్సరం భారత్‌కు రాజకీయంగా, ఎన్నికల పరీక్షలు ఉన్నాయని, అలాగే క్రీడా రంగంలో టైటిళ్లను కాపాడుకోవడం వంటి సవాళ్లు ఉన్నాయని అన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఎగుమతులకు సంబంధించిన సవాళ్లు, అంతర్జాతీయ వేదికపై సంబంధాలను నిర్వహించడం, ఉగ్రవాదం, ప్రపంచ సంఘర్షణ వంటి ముప్పులు కూడా పెద్ద ఎత్తున పొంచి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సంవత్సరం భారత్ ముందున్న 10 పెద్ద సవాళ్లను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: రో–కో దెబ్బకి 8 నిమిషాల్లోనే IND vs NZ తొలి వన్డే టికెట్స్ సోల్డ్ అవుట్..!
1. 2026 సంవత్సరం ప్రతిపక్షాలకు అతిపెద్ద ఎన్నికల పరీక్షను తీసుకువస్తుంది. ఈ సంవత్సరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల దిశదశను నిర్ణయిస్తాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో జరిగే ఈ ఎన్నికలు.. వాస్తవానికి అధికారం కోసం జరిగే యుద్ధం మాత్రమే కాదు, ఇండియా కూటమి బలం, వ్యూహానికి ఒక పరీక్ష కూడా. అలాగే ఇప్పుడు 2026 లో మరో కొత్త సవాలు గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు చారిత్రాత్మకమైనది. ఎందుకంటే 2025 లో భారతదేశం జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇప్పుడు ఇండియా యొక్క తదుపరి ప్రధాన లక్ష్యం జర్మనీని అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం. అదనంగా 2026 లో అమెరికాతో సుంకాల యుద్ధం కూడా భారతదేశానికి ఒక సవాలుగా మారింది.
2. ఈ ఏడాది సామాన్యులకు ద్రవ్యోల్బణం విషయంలో ఒక ముఖ్యమైన సవాలును తెస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ బడ్జెట్‌కు ముందే, ద్రవ్యోల్బణం ప్రభావం తీవ్రం కావడం ప్రారంభమైందని చెబుతున్నారు. నేడు వాణిజ్య సిలిండర్ల ధరలు పెరిగాయి, బంగారం, వెండి కొనుగోలు చేయడం సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. రైలు టిక్కెట్లు, వాహనాల ధరలు కూడా పెరిగాయి. సంవత్సరం మొదటి రోజే ప్రభుత్వం దెబ్బ కొట్టింది. వాణిజ్య LPG సిలిండర్ల ధరను రూ.111 పెంచింది. ఈ ధరల పెరుగుదల ప్రభావం సాధారణ ప్రజలపై అధికంగా కనిపించనుంది. హోటళ్ళు, రెస్టారెంట్లు, మార్కెట్లలో విక్రయించే ఆహార పదార్థాలు ఇప్పుడు మరింత ఖరీదైనవిగా మారతాయి.
3. ఇప్పుడు భారత క్రికెట్‌లోని సవాళ్ల గురించి తెలుసుకుందాం. 2026 సంవత్సరం టీమిండియాకు చాలా కీలకం. ఈ ఏడాది భారత్ అతిపెద్ద సవాల్ సొంత గడ్డపై టీ20 ప్రపంచ కప్ గెలవడం. ఈ ఫార్మెట్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ కాబట్టి, టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను కాపాడుకోవడం అతిపెద్ద సవాలు అని అంటున్నారు. గతంలో బయటపడ్డ లోపాలను సరిదిద్దుకుని ప్రపంచ స్థాయిలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడమే ప్రస్తుతం టీమిండియా ముందు ఉన్న లక్ష్యం.
4. ఈ ఏడాది భారత్ ఎదుర్కొనే అతి పెద్ద సవాలు ఉగ్రవాదం. పాకిస్థాన్ తన దుష్ట కుట్రలో భాగంగా డ్రోన్ ద్వారా భారత భూభాగంలోకి పేలుడు పదార్థాలను పంపడానికి ప్రయత్నించింది. కానీ సైన్యం పాకిస్థాన్ కుట్రను సకాలంలో భగ్నం చేసింది. వాస్తవానికి, పూంచ్‌లోని నియంత్రణ రేఖ సమీపంలో డ్రోన్‌లు వేసిన పేలుడు పదార్థాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఇదే టైంలో జమ్మూ కాశ్మీర్‌లో అనుమానిత ఉగ్రవాదుల కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాది రఫీక్ అలియాస్ సుల్తాన్‌కు పూంచ్‌లో ఉన్న ఆస్తిని భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2026 లో దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడం కూడా ఒక సవాలుగా మారింది.
5. పొరుగు దేశాలతో సంబంధాలు, అంతర్జాతీయ సంబంధాల పరంగా కూడా 2026 సంవత్సరం భారతదేశానికి అత్యంత సవాలుతో కూడుకున్నది. 2026 ప్రారంభంతోనే, ప్రపంచ రాజకీయాల గమనాన్ని మార్చే ఎన్నికలపై కేంద్రీకృతమై ఉంది. అలాగే ఇప్పుడు 2026 క్యాలెండర్ భారతదేశ భద్రత, వాణిజ్యం, దౌత్యంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే ప్రధాన మార్పులను సూచిస్తుంది. ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం ప్రభావం పెరుగుతున్నందున, పశ్చిమం నుంచి తూర్పు వరకు దేశాలలో జరిగే ఎన్నికలు చాలా కీలకమైనవి. అయితే ఇండియా పొరుగు దేశాలలో జరుగుతున్న ఎన్నికలను ప్రత్యేకంగా పరిశీలిస్తుంది. వీటిలో బంగ్లాదేశ్, నేపాల్ ఎన్నికలు భారతదేశంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఇజ్రాయెల్, రష్యాలో ఎన్నికలు కూడా భారత్‌కు చాలా కీలకం.
6. భారతదేశానికి ఇది బ్రిక్స్ సంవత్సరం. 2026లో ఇండియాలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఇది భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద దౌత్య కార్యక్రమాలలో ఒకటి అవుతుంది. ప్రపంచ సమాజానికి సందేశాన్ని పంపడానికి భారత ప్రభుత్వం G20 మాదిరిగానే దీనిని గొప్పగా, సమగ్రంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తోంది. పశ్చిమాసియాలో అయినా లేదా ఉక్రెయిన్ యుద్ధం అయినా, ఈ సంవత్సరం దౌత్యం, చర్చించుకోవడం ద్వారా సంఘర్షణ పరిష్కారం కోసం భారతదేశం నిరంతరం చెబుతూ వచ్చింది.
7. ప్రస్తుతం దేశం ప్రకృతి వైపరీత్యాలను తగ్గించే సవాలును ఎదుర్కొంటోంది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడం ఒక ప్రధాన సవాలు. దేశంలో 2025 లో ప్రకృతి వైపరీత్యాలు విధ్వంసం సృష్టించాయి. కొన్ని చోట్ల భీకర వర్షాల కారణంగా, వరదలతో కొండచరియలు విరిగిపడ్డాయి, వరదలు ఇతర చోట్ల విధ్వంసం సృష్టించాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.
8. ఈ నూతన సంవత్సరాన్ని ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. కొత్త ఏడాదిని స్వాగతించడంతో పాటు, వారు తమను తాము ఫిట్‌గా ఉంచుకునే సవాలును కూడా స్వీకరించారు. దీంతో ఊబకాయాన్ని ఎదుర్కోవడానికి మందుల వాడకం 2026 నాటికి వేగంగా పెరుగుతుందని ఒక అంచనా ఉంది. ఓజెంపిక్, వెగోవీ వంటి బరువు తగ్గించే మందులకు ఈ ఏడాది డిమాండ్ పెరుగుతోందని అంటున్నారు. భారతదేశంతో సహా అనేక దేశాలలో వాటి మార్కెట్ విస్తరిస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ మందుల దీర్ఘకాలిక ప్రభావాలు, వాటి అధిక ధర, నిరంతర ఉపయోగం గురించి ఆందోళనలు కొనసాగుతున్నాయి.
9. ఈ ఏడాది భారత్ ముందు ఉన్న మరొ ప్రధాన సవాలు సైబర్ మోసాన్ని అరికట్టడం. నేడు దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని మంది సైబర్ మోసానికి బలైపోతూ, లక్షలాది రూపాయలు కోల్పోతున్నారు. నిజానికి భారత్‌కు 2026 లో సైబర్ మోసాన్ని ఎలా నిర్మూలించాలి అనేది ఒక పెద్ద సవాలు. సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో షేర్ ట్రేడింగ్ మోసం 2025 లో అతిపెద్ద ముప్పుగా బయటపడిందని తేలింది. 2025లో సైబర్ మోసానికి సంబంధించి 24,442 ఫిర్యాదులు నమోదయ్యాయి, వాటి మొత్తం రూ.117 కోట్లు. సైబర్ నేరాలపై అవగాహన ఉన్న వారు వెంటనే టోల్-ఫ్రీ నంబర్ 1930ని సంప్రదించి రూ.27.2 కోట్లు తిరిగి పొందారు.
10. 2026 లో దేశంలోని రైతులు, యువత అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. రైతులు ఎరువుల కొరతతో సతమతమవుతుండగా, యువత నిరుద్యోగంతో సతమతమవుతోంది. 2026 లో పరిస్థితి మారుతుందా అనేది ప్రస్తుతానికి ఒక ప్రశ్నగానే ఉంది. నేడు రైతులు తమ పంటలకు ఎరువుల కొరతతో ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగం యువతను ఉద్యోగాల కోసం పోటీ పడేలా చేసింది.
READ ALSO: Team India Women Coach: టీమిండియాకు కొత్త కోచ్.. బీసీసీఐ కీలక నిర్ణయం
