Site icon NTV Telugu

Delhi: కాంగ్రెస్‌కు మరింత బలం.. హస్తం గూటికి ఎంపీ విశాల్ ప్రకాష్ బాబు

Khsde

Khsde

పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తర్వాత కాంగ్రెస్సే ఎక్కువ స్థానాలు గెలిచింది. సొంతంగా 99 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. తాజాగా ఆ సంఖ్య 100కు చేరింది. మహారాష్ట్రలో సంగ్లీ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన ప్రకాష్ బాబు పాటిల్ హస్తం గూటికి చేరారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో విశాల్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. విశాల్ చేరికతో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య 100కు చేరింది.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 ఎంపీ స్థానాల్లో గెలుపొందింది. ఇండియా కూటమి మొత్తం కలిపి 232 స్థానాల్లో గెలిచింది. అధికారం చేపట్టాలంటే 272 సీట్లు అవసరం. అయితే ఆ మేజిక్ ఫిగర్‌కు ఇంకా 40 సీట్లు అవసరం. ఇప్పుడు ఒక ఎంపీ చేరడంతో క్రమంగా కాంగ్రెస్ బలం పెరుగుతోంది. మరికొంత మంది ఎంపీలు కూడా చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఇతర పక్షాలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానం పలికారు.

ఇది కూడా చదవండి: Uganda: ప్రపంచకప్ చరిత్రలో ఉగాండా తొలి విజయం.. సెలబ్రేషన్స్ అదరగొట్టారు

 

Exit mobile version