Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ!
- అభిషేక్ శర్మ విధ్వంసం
- 47 బంతుల్లో సెంచరీ
- తొలి భారత బ్యాటర్‌గా అభిషేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma Becomes First Indian Batter: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా ఆదివారం జింబాబ్వే జరిగిన రెండో టీ20ల్లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. అరంగేట్ర మ్యాచ్‌లో విఫలమైన అభిషేక్.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సులతో సెంచరీ చేశాడు. అభిషేక్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్టైల్లో సిక్సర్‌తో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇన్నింగ్స్‌ల పరంగా అత్యంత వేగంగా మొదటి సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. రెండు ఇన్నింగ్స్‌ల వ్యవధిలోనే అభిషేక్ సెంచరీ బాదాడు. ఈ క్రమంలో దీపక్ హుడా, కేఎల్ రాహుల్‌లను అతడు అధిగమించాడు. మూడు ఇన్నింగ్స్‌ల వ్యవధిలో దీపక్ సెంచరీ బాదగా.. నాలుగు ఇన్నింగ్స్ వ్యవధిలో రాహుల్ శతకం సాధించాడు.
Also Read
- Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
- Rajnath Singh: భారత్‌కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
- Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్‌పాల్‌కు ఆదేశం
- Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన నాలుగో భారత బ్యాటర్‌గా అభిషేక్ శర్మ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (38) అగ్రస్థానంలో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ (45), కేఎల్ రాహుల్ (46) తర్వాత అభిషేక్ శర్మ (46) ఉన్నాడు. ఇక ఈ ఏడాది ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా అభిషేక్ నిలిచాడు. 2024లో 18 టీ20 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్ 50 సిక్స్‌లు బాదాడు. రోహిత్ శర్మ 25 మ్యాచ్‌ల్లో 46 సిక్స్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. .25 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 45 సిక్స్‌లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
తాజావార్తలు
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్‌కు డెడ్‌లైన్.!
-
Endurance Ship: 100ఏళ్ల రహస్యం..ఓడ మిస్టరీ వీడింది!
-
Kotha Cinema: హైదరాబాద్‌లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు “కొత్త సినిమా”!**
-
Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
-
Raviteja: మాస్ మహారాజా కొత్త జాతర.. “దాగుడు మూతలు దండాకోర్” అంటూ సంక్రాంతికి?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!