IND vs WI Dream11 Prediction: భారత్, వెస్టిండీస్ డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs WI Dream11 Team Prediction for 2nd Test: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 కొత్త సైకిల్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడిక సిరీస్‌లో చివరిదైన రెండో పోరుకు రంగం సిద్ధమైంది. రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తుండగా.. సొంతగడ్డపై పరువు కాపాడుకోవాలని విండీస్ చూస్తోంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగే ఈ టెస్ట్ మ్యాచ్ ఈ రోజు రాత్రి 7.30కు ఆరంభం కానుంది. డీడీ స్పోర్ట్స్, జియో సినిమాలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
తొలి టెస్టులో విజయం సాధించిన భారత్.. రెండో టెస్ట్ కోసం జట్టులో పెద్దగా మార్పులు చేసే అవకాశాలు లేవు. గత మ్యాచ్‌లోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసి భారీ శతకంతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ మరోసారి పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడేమో చూడాలి. కెరీర్లో తొలి టెస్టు ఆడిన ఇషాన్ కిషన్‌కు ఎక్కువసేపు క్రీజులో నిలిచే అవకాశం రాలేదు. ఈ మ్యాచ్‌లో అతడికి ఆడే అవకాశం ఇవ్వొచ్చు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జోరు కొనసాగించాలని చూస్తున్నారు. ఇక తొలి టెస్టులో విఫలమైన అజింక్య రహానే.. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతాడో మరి.
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
డొమినికాతో పోలిస్తే క్వీన్స్ పార్క్ ఓవల్ పిచ్ కాస్త భిన్నం. పేసర్లు ఎక్కువ ప్రభావం చూపనున్నారు. దాంతో ఇరు జట్లు పసర్లపై ప్రధాన దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇక్కడ స్పిన్నర్ల సగటు (36.57)తో పోలిస్తే.. పేసర్ల సగటు (27.39) మెరుగ్గా ఉంది. మ్యాచ్ జరిగే ఐదు రోజులూ వర్షం అంతరాయం కలిగించే సూచనలు ఉన్నాయి. క్వీన్స్ పార్క్ ఓవల్‌లో ఆడిన 13 టెస్టుల్లో భారత్ 3 గెలిచి.. మరో 3 ఓడింది. ఇక 7 మ్యాచ్‌లను 7 డ్రా చేసుకుంది.
Also Read: Stuart Broad 600 Wickets: టెస్టు క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించిన స్టువర్ట్ బ్రాడ్!
తుది జట్లు (India vs West Indies Probable XIs):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, ఇషాన్ కిషన్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్.
వెస్టిండీస్: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), టాగెనరైన్ చందర్‌పాల్, రేమన్ రీఫర్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అథానాజ్, జాషువా ది సిల్వా (కీపర్), జాసన్ హోల్డర్, రకీమ్ కార్న్‌వాల్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, జోమెల్ వారికన్.
డ్రీమ్ 11 టీమ్ (India vs West IndiesDream11 Prediction):
కెప్టెన్: రోహిత్ శర్మ
వైస్ కెప్టెన్: రవిచంద్రన్ అశ్విన్
వికెట్ కీపర్: ఇషాన్ కిషన్
బ్యాటర్లు: రోహిత్ శర్మ, అలిక్ అథానాజె, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ
ఆల్‌రౌండర్లు: రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రకీమ్ కార్న్‌వాల్, జాసన్ హోల్డర్
బౌలర్లు: కెమర్ రోచ్, మొహ్మద్ సిరాజ్
Also Read: Shah Rukh Khan ICC: వన్డే ప్రపంచకప్ ట్రోఫీతో షారుఖ్ ఖాన్.. ఇక భారత్‌ను ఎవరూ ఆపలేరు!
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!