IND vs WI: అహ్మదాబాద్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ పిచ్ మంచిగా ఉందని, ఇందులో తేమ ఎక్కువగా ఉన్నప్పటికీ తమ ఆటగాళ్లు బాగానే ఆడతారని చేజ్ పేర్కొన్నాడు. డబ్ల్యూటీసీలో పాయింట్లు సాధించడం తమ లక్ష్యమని, ఈ పిచ్‌పై చివరిగా బ్యాటింగ్ చేయాలనుకోవడం లేదని తెలిపాడు. ఇక వెస్టిండీస్ తరపున ఖారీ పియెర్, జోహాన్ లేన్ అరంగేట్రం చేస్తున్నారు.
Planes Collide: తృటిలో పెను ప్రమాదం మిస్.. ఢీకొన్న రెండు విమానాలు
మరోవైపు భారత జట్టులో కుల్దీప్ యాదవ్ తిరిగి టెస్ట్ జట్టులోకి వచ్చాడు. అక్షర్ పటేల్‌కు జట్టులో చోటు దక్కకపోవడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారత్ ముగ్గురు స్పిన్నర్లు (జడేజా, కుల్దీప్, సుందర్) మరియు ఇద్దరు పేసర్లు (బుమ్రా, సిరాజ్) తో బరిలోకి దిగింది. నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండర్‌గా జట్టులో ఉన్నాడు. కొత్త కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ లో మ్యాచ్ ఆడనున్నాడు. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తరువాత భారత్ ఈ సిరీస్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటోందని, ‘సులభమైన ఎంపికల కోసం చూడటం లేదని’ గిల్ పేర్కొన్నాడు. ఇక ఇరు జట్ల ప్లేయింగ్ XI ఇలా..
భారత జట్టు: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.
వెస్టిండీస్ జట్టు: తేజనరైన్ చందర్‌పాల్, జాన్ క్యాంప్‌బెల్, అలిక్ అతానాజ్, బ్రాండన్ కింగ్, షై హోప్ (వికెట్ కీపర్), రోస్టన్ చేజ్ (కెప్టెన్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వార్రికన్, ఖారీ పియెర్, జోహాన్ లేన్, జేడెన్ సీల్స్.
