Ravichandran Ashwin to Join Anil Kumble and Harbhajan Singh Elite List: భారత్, వెస్టిండీస్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా బుధవారం (జూలై 12) నుంచి రోసోలోని విండ్సర్ పార్క్‌లో తొలి టెస్టు జరగనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో మొదటి విదేశీ పర్యటనను సానుకూలంగా ప్రారంభించాలని చూస్తోంది. మరోవైపు తమ ఆటను మెరుగుపర్చాలని కరేబియన్ జట్టు కోరుకుంటుంది. ప్రపంచ నంబర్ 1 టెస్ట్ జట్టు అయిన భారత్.. గత రెండు దశాబ్దాలుగా వెస్టిండీస్‌లో టెస్ట్ సిరీస్‌ను కోల్పోలేదు. ఈ సిరీస్‌లో కూడా ఆ రికార్డును కొనసాగించాలని టీమిండియా చూస్తోంది. అయితే ఈ మ్యాచ్ ముందు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్ట్‌లో రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు పడగొడితే.. అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్ల మైలురాయిని అందుకుంటాడు. ఇప్పటివరకు అశ్విన్ మూడు ఫార్మాట్లలో కలిపి 270 మ్యాచ్‌లు ఆడి.. 697 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం యాష్ ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి.. మూడు వికెట్స్ పడగొట్టడం అతడికి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. డొమినికాలో జరిగే తొలి టెస్టులోనే ఈ ఫీట్‌ను సాధించే అవకాశాలు ఉన్నాయి.
సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీస్తే.. భారత క్రికెట్‌లో 700 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా రికార్డుల్లో నిలుస్తాడు. ఇప్పటివరకు భారత్ తరఫున ఇద్దరు బౌలర్లు మాత్రమే 700 వికెట్ల మైలురాయిని అందుకున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే 956 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 711 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. విండీస్ పర్యటనలో అశ్విన్ అద్భుత ప్రదర్శన చేస్తే.. హర్భజన్ సింగ్‌ను కూడా అధిగమించనున్నాడు. అశ్విన్‌కు విండీస్‌పై ఇప్పటివరకు 11 టెస్టులు ఆడి.. 60 వికెట్లు, 552 పరుగులు చేశాడు.
Also Read: IND vs WI: నాడు తండ్రి, నేడు కొడుకు.. అరుదైన లిస్టులో విరాట్ కోహ్లీ! ఒకే ఒక్కడు సచిన్
