IND vs UAE: యూఏఈతో మ్యాచ్.. ప్లేయింగ్ 11పై హింట్ ఇచ్చేసిన బౌలింగ్ కోచ్!
- దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు భారత్-యూఏఈ మ్యాచ్
- టీమిండియా తుది జట్టుపై ఆసక్తి
- ప్లేయింగ్ 11పై హింట్ ఇచ్చేసిన బౌలింగ్ కోచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Playing 11 vs UAE: ఆసియా కప్ 2025 నిన్న ఆరంభమైంది. టోర్నీని అఫ్గానిస్థాన్ ఘన విజయంతో మొదలు పెట్టింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో 94 పరుగుల తేడాతో హాంకాంగ్‌ను చిత్తుగా ఓడించింది. నేడు భారత్ తన తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు యూఏఈని ఢీకొట్టనుంది. కీలక పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు సన్నాహకంగా ఈ పోరును వాడుకోవాలని టీమిండియా చూస్తోంది. అయితే టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ప్లేయింగ్ 11పై హింట్ ఇచ్చాడు.
‘దుబాయ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడాం. అనంతరం ఇక్కడ చాలా మ్యాచులు జరిగాయి. ఇప్పుడు పిచ్ స్పందించే తీరు మారిపోయే అవకాశం ఉంది. మ్యాచ్‌కు ముందు పిచ్‌ను చూసి ఓ అంచనాకు వస్తాం. ప్రస్తుతం పిచ్‌పై కొద్దిగా పచ్చిక ఉంది. యూఏఈ మ్యాచ్‌లో ఎలా బరిలోకి దిగాలో మాకు స్పష్టమైన అవగాహన ఉంది. అత్యుత్తమ జట్టును బరిలోకి దించుతాం. అదనపు పేసర్ లేదా స్పిన్నర్ అనేది మ్యాచ్‌కు ముందు నిర్ణయిస్తాం’ అని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు.
Also Read
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
‘ఆసియా కప్ 2025లో గేమ్ ఛేంజర్ కుల్దీప్ యాదవే. అతడు తన కెరీర్లో ఎన్నో ఓవర్లు వేశాడు. టీ20ల్లో ఎలా బౌలింగ్ చేయాలో అతడికి బాగా తెలుసు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కుల్దీప్ స్పెషల్ బౌలర్ అనే చెబుతా. అతడు ప్రొఫెషనల్ అథ్లెట్. ఇంగ్లండ్ పర్యటనలో ఛాన్స్ రాకపోయినా అతడి యాటిట్యూడ్ మాత్రం అలానే ఉంది. ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకొనేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆసియా కప్‌లో రాణిస్తాడు అని నా నమ్మకం’ అని మోర్నీ మోర్కెల్ పేరొన్నాడు.
మోర్నీ మోర్కెల్ వ్యాఖ్యలను బట్టి చూస్తే తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లకు చోటు పక్కాగా కనిపిస్తోంది. ఆల్‌రౌండర్ కోటాలో అక్షర్ పటేల్.. స్పెసలిస్ట్ స్పిన్నర్ కోటాలో వరుణ్ చక్రవర్తి ఆడనున్నారు. కుల్దీప్ యాదవ్‌ను కూడా తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్ పేసర్లుగా తుది జట్టులో ఉంటారు. పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా ఉంటాడు. ఇద్దరు ఆల్‌రౌండర్లు, నలుగురు బౌలర్లు జట్టులో ఉంటారు. ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు ప్లేయింగ్ 11లో ఉంటారు. అభిషేక్, గిల్, తిలక్, సూర్య, శాంసన్ లేదా జితేష్ ఆడనున్నారు.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!