NTV Telugu Site icon

IND vs SL: స్పిన్ తో మాయచేసిన రియాన్ పరాగ్.. టీమిండియా టార్గెట్ 249..

Ind Vs Sl

Ind Vs Sl

IND vs SL 3rd ODI: టీమిండియా, శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య మూడవ, చివరి వన్డే నేడు (ఆగస్టు 7) కొలంబోలో జరుగుతోంది. నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక మొదటి బ్యాటింగ్ చేపట్టింది. ఈ నేపధ్యం లో మొదటగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణిత 50 ఓవర్స్ లో 7 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఇక శ్రీలంక బ్యాటింగ్ లో ఓపెనర్లు పాతుం నిస్సంక 65 బంతుల్లో 45 పరుగులు చేయగా., మరో ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో తనదైన బ్యాటింగ్ తో 102 బంతుల్లో 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత కుశాల్ మెండిస్ 82 బంతుల్లో 59 పరుగులతో హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. కెప్టెన్ చరిత్ అసలంక 12 బంతుల్లో 10 పరుగులు, సుధీర సమరవీసీక్రమ పరుగులేమి చేయకుండా వెనుతిరిగారు. జనిత లియానాగే 12 బంతుల్లో 8 పరుగులు, దునిత్ వెళ్లలాగే 3 బంతుల్లో 2 పరుగులు, కామిందు మెండిస్ 19 బంతుల్లో 23 పరుగులతో నాట్ అవుట్.. మహీశా తీక్షణ 4 బంతుల్లో 3 పరుగులు నాట్ అవుట్ చేసారు.

Putin: ఇజ్రాయెల్ విషయంలో ఇరాన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక సూచన

ఇక మరోవైపు టీమిండియా బౌలర్లు బాగానే రాణించారు. రియాన్ పరాగ్ 9 ఓవర్లులో 3 వికెట్స్ తీయగా.. మహమ్మద్ సిరాజ్, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ లు చెరో వికెట్ ను తీసుకున్నారు. ఇక టీమిండియా పరుగులను చేయాల్సి ఉంది.