Site icon NTV Telugu

IND vs SL: టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక.. భారత తుది జట్టు ఇదే!

Ind Vs Sl 2nd Odi

Ind Vs Sl 2nd Odi

IND vs SL Playing 11: కొలంబో వేదికగా మరికొద్దిసేపట్ల భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన ఆతిథ్య శ్రీలంక బ్యాటింగ్‌ ఎంచుకుంది. తుది జట్టులో రెండు మార్పులు చేసినట్లు లంక కెప్టెన్ చరిత్ అసలంక తెలిపాడు. హసరంగ, షిరాజ్ స్థానాల్లో కమిందు మరియు వాండర్సే వచ్చారు. మరోవైపు భారత్‌ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ టైగా ముగిసిన సంగతి తెలిసిందే.

తుది జట్లు:
భారత్‌: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్‌ దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్
శ్రీలంక: పాథున్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక (కెప్టెన్), కమిందు మెండిస్, జనిత్ లియనగె, దునిత్ వెల్లలాగె, అకిల ధనంజయ, అసిత్ ఫెర్నాండో, జెఫ్రీ వెండర్సె

Exit mobile version