Site icon NTV Telugu

IND vs SA: కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్న రిచా ఘోష్‌.. దక్షిణాఫ్రికా లక్ష్యం ఎంతంటే?

Richa Ghosh 94 Runs

Richa Ghosh 94 Runs

మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో భాగంగా విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో భారత్ బ్యాటింగ్ ముగిసింది. 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది. కష్టాల్లో పడిన జట్టును రిచా ఘోష్ (94; 77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆడుకుంది. అయితే తృటిలో సెంచరీ మిస్ చేసుకుంది. ఇన్నింగ్స్ చివరలో స్నేహ్ రాణా (33) ధాటిగా ఆడింది. ఓపెనర్లు ప్రతీకా రావల్ (37), స్మృతి మంధాన (23)లు మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా ముందు 252 పరుగుల లక్ష్యంను భారత్ ఉంచింది.

ఓపెనర్లు ప్రతీకా రావల్, స్మృతి మంధాన శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు ఇద్దరు 55 పరుగులు జోడించారు. మంధానను ఎంలబా అవుట్ చేసింది. ప్రతీకా, హర్లీన్‌ డియోల్ (13) జట్టు స్కోరును ముందుకు నడిపారు. 83/1తో పటిష్టంగా ఉన్న భారత్ అనుహ్యంగా వికెట్లు కోల్పోయి.. 102/6తో పీకల్లోతు ఇబ్బందుల్లో పడింది. స్వల్ప వ్యవధిలో జెమీమా, హర్మన్‌ప్రీత్‌, దీప్తి శర్మ లు అవుట్ అయ్యారు. దీంతో భారత్ 19 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో రిచా ఘోష్ కీలక ఇనింగ్స్ ఆడింది. అమన్‌జ్యోత్ కౌర్ సహకారంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. స్నేహ్ రాణాతో బ్యాటింగ్‌ కొనసాగించి జట్టును పటిష్ట స్థితికి చేర్చింది. 49 ఓవర్లో స్నేహ్ రాణా అవుట్ కాగా.. చివరి ఓవర్ నాలుగో బంతికి రిచా పెవిలియన్ చేరింది.

Also Read: Karva Chauth 2025: ‘కర్వా చౌత్’ ఉపవాసం, పూజకు శుభ సమయం ఇదే!

లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా తడబడుతోంది. 6 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 20 రన్స్ చేసింది. టాజ్మిన్ బ్రిట్స్ డకౌట్ కాగా.. సునే లూస్ 5 రన్స్ చేసింది. క్రీజులో లారా వోల్వార్డ్ట్ (11), మారిజాన్ కాప్ (1) ఉన్నారు. దక్షిణాఫ్రికా ఇంకా 232 రన్స్ చేయాల్సి ఉంది. క్రాంతి గౌడ్, అమన్‌జోత్ కౌర్ తలో వికెట్ పడగొట్టారు. మరో 2-3 వికెట్స్ పడితే.. భారత్ విజయం ఖరారు అవుతుంది.

Exit mobile version