NTV Telugu Site icon

Sanju Samson: గత రెండు నెలలుగా ఎంతో కష్టపడ్డా.. సంజూ శాంసన్ ఎమోషనల్!

Sanju Samson Interview

Sanju Samson Interview

Sanju Samson Says I Am Happy For Century in IND vs SA 3rd ODI: దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో సెంచరీ సాధించినందకు సంతోషంగా ఉందని కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్ తెలిపాడు. గత రెండు నెలలుగా ఎంతో కష్టపడ్డానని, చివరకు ఫలితం వచ్చింనందుకు ఆనందంగా ఉందన్నాడు. భారత జట్టు విజయంలో తన పాత్ర ఉన్నందుకు సంతోషంగా ఉందని సంజూ చెప్పాడు. మూడో వన్డేలో శాంసన్ 114 బంతుల్లో 6 ఫోర్లు, మూడు సిక్సులతో 108 రన్స్ చేశాడు. భారత్ ఇన్నింగ్స్‌లో సంజూ ఆట హైలైట్‌గా నిలిచింది. 2015లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సంజూకు వన్డేల్లో ఇదే మొదటి సెంచరీ. వన్డేల్లో 2021లో తొలి మ్యాచ్‌ ఆడాడు.

మూడో వన్డేలో సెంచరీ చేసిన సంజూ శాంసన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘సెంచరీ సాధించినందకు చాలా సంతోషంగా ఉంది. గత కొన్ని నెలలుగా ఎంతో కష్టపడ్డా. చివరకు మంచి ఫలితం వచ్చినందుకు ఆనందంగా ఉంది. వన్డల్లో వికెట్ మరియు బౌలర్ మైండ్‌సెట్‌ను అర్థం చేసుకోవడానికి కొంత సమయం ఉంటుంది. అగ్రస్థానంలో బ్యాటింగ్ చేయడం వల్ల 10-20 అదనపు డెలివరీలు లభిస్తాయి. కొత్త బంతితో దక్షిణాఫ్రికా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. కేఎల్ రాహుల్ ఔటైన తర్వాత నేను, తిలక్ వర్మ కుదురుకోవడానికి ప్రయత్నించాం’ అని సంజూ చెప్పాడు.

Also Read: Srisailam: మల్లన్న భక్తులకు అలర్ట్‌.. మూడు రోజులపాటు ఆర్జిత అభిషేకాలకు బ్రేక్‌

‘తిలక్ వర్మ ఆటతో దేశం మొత్తం చాలా గర్వంగా ఉంది. అతని నుండి ఇంకా చాలా ఆశించవచ్చు. సీనియర్లు భారత క్రికెట్ ప్రమాణాలను నెలకొల్పారు. జూనియర్లు దానిని కంటిన్యు చేస్తున్నారు. అయితే ప్రయాణం చేస్తూ 2-3 రోజుల వ్యవధిలోనే మ్యాచ్‌లు ఆడటం చాలా కష్టం. అయినా మేం బాగానే ఆడుతున్నాం’ అని సంజూ శాంసన్ చెప్పాడు. టీ20లో అంచనాలను అందుకోలేకపోతున్న సంజూ.. వన్డేల్లో మాత్రం నిలకడ ప్రదర్శిస్తున్నాడు. వన్డేల్లో 13 ఇన్నింగ్స్‌ల్లో 50.25 సగటుతో 402 పరుగులు చేశాడు.