Site icon NTV Telugu

IND vs SA: 5 వికెట్లతో చెలరేగిన బుమ్రా.. దక్షిణాఫ్రికా ఆలౌట్..!

Ind Vs Sa

Ind Vs Sa

IND vs SA: కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి రోజే దక్షిణాఫ్రికా తక్కువ స్కోరుకే కుప్పకూలింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా, భారత బౌలర్ల ధాటికి కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా ధాటికి ప్రోటిస్ బ్యాటర్లు క్యూ కట్టారు. బుమ్రాకి తోడుగా సిరాజ్, ల్దీప్ కూడా కీలక వికెట్లు తీసి మరింత ఒత్తిడి తెచ్చారు. ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్, రికెల్టన్ ఆరంభంలో కాస్త ఆడినప్పటికీ బుమ్రా వేసిన కఠినమైన లెంగ్త్‌ బంతులకు ఎక్కువసేపు నిలువలేకపోయారు. రికెల్టన్ (23) అవుట్ అయిన వెంటనే మార్క్రామ్ (31) కూడా పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత మధ్యలో వియన్ ముల్డర్ (24) ఓ ప్రయత్నం చేసినప్పటికీ కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయలో చిక్కుకున్నాడు. కెప్టెన్ బవుమా కేవలం 3 పరుగులకే అవుట్ కావడంతో వారి పఠనం దాదాపు ఖాయమైంది. ఇక టోనీ డి జోర్జి (24) ఓ వైపు నిలబడ్డా మరోవైపు వికెట్లు వరుసగా కోల్పోవడంతో స్కోరు వేగం పూర్తిగా తగ్గింది. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (15*), వెర్రేయన్నే (16) పరుగులు చేసినా పెద్ద స్కోరు మాత్రం రాలేదు.

BOB Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,700 పోస్టులు.. మంచి జీతం.. మిస్ చేసుకోకండి

ఇక మరోవైపు టీమిండియా బౌలర్స్ లో బుమ్రా ఈడెన్ గార్డెన్స్ ట్రాక్‌ను పూర్తిగా తన కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాడు. 14 ఓవర్లలో 5 మెయిడెన్లతో కేవలం 27 పరుగులకే 5 వికెట్లు దక్కించుకున్నాడు. ఇక మిగితా బోవెలర్స్ లో మహమ్మద్‌ సిరాజ్‌ (2/47) కీలక సమయాల్లో రెండు వికెట్లు తీశాడు. స్పిన్ విభాగం నుంచి కుల్దీప్ (2/36), అక్షర్ (1/21) కూడా తమ వంతు బాధ్యత నిర్వర్తించారు. దక్షిణాఫ్రికా 55 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ కావడంతో మ్యాచ్ తొలి రోజు పూర్తిగా భారత బౌలర్లదే అయింది.

Salumarada Thimmakka: 114 ఏళ్ల “వృక్షమాత” సాలుమరద తిమ్మక్క కన్నుమూత..

Exit mobile version