IND vs SA Test: ముగిసిన మొదటిరోజు ఆట.. స్కోర్ ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SA Test: కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు వార్ వన్ సైడ్ లా ముగిసింది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. ఆ నిర్ణయం పూర్తిగా ఫలితాన్ని ఇచ్చింది. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం బాగానే కనిపించినా.. ఆ తర్వాత భారత బౌలర్లు విజృభించడంతో వికెట్లు వరుసగా కోల్పోయింది. దక్షిణాఫ్రికా తరఫున ఐడెన్ మార్క్రామ్ (31), రికెల్టన్ (23), డే జోర్జీ (24), ముల్డర్ (24) మాత్రమే కొంత ప్రతిఘటన చూపగలిగారు. మిగతా బ్యాటర్లు భారత బౌలింగ్ ముందు తట్టుకోలేకపోయారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను తక్కువ పరుగులకే పరిమితం చేశాడు. ఇక మిగితా భారత బౌలర్స్ లో మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు.
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
159 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలో జాగ్రత్తగా ఆడింది. టీమిండియా ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ (12) త్వరగా ఔటవ్వగా.. కెఎల్ రాహుల్ (13*), వాషింగ్టన్ సుందర్ (6*) జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఇక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 20 ఓవర్లలో 37/1 పరుగులు చేసింది. ఇంకా 122 పరుగులు వెనుకంజలో ఉంది. ఇక రెండో రోజు తొలి సెషన్ ఈ మ్యాచ్ దిశను నిర్ణయించనుంది.
DigiLocker: అత్యవసర పరిస్థితుల్లో ఆపద్బాంధవుడిలా డిజిలాకర్.. ఎలా ఉపయోగపడుతుందంటే?
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!