Site icon NTV Telugu

IND vs PAK: షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్న భారత్-పాకిస్థాన్ ప్లేయర్లు.. ఫోటో వైరల్!

Ind Vs Pak

Ind Vs Pak

పహాల్గమ్ ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దాడి అనంతరం పాక్‌కు ప్రతి విషయంలో దెబ్బ కొడుతున్నారు మనోళ్లు. మొన్న ముగిసిన ఆసియా కప్ 2025లో టీమిండియా ప్లేయర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు జరుగుతున్న ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025లో భారత మహిళలు జట్టు కూడా నో షేక్ హ్యాండ్ విధానాన్ని కొనసాగిస్తోంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.

Also Read: IND vs AUS: కోహ్లీ మిస్టర్ పర్‌పెక్ట్‌.. 3 మ్యాచ్‌లలో 2 సెంచరీలు చేస్తాడు!

వైరల్ అవుతున్న వీడియోలో భారత్ ఆటగాళ్లు పాకిస్థాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్స్ ఇచ్చారు. తాజాగా మలేషియాలో జరిగిన సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ హాకీ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు.. భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు ఒకరికొకరు హై-ఫైవ్ ఇచ్చుకున్నారు. ఈ సంఘటన హ్యాండ్‌షేక్ వివాదానికి ముగింపు పలికినట్లు క్రీడాభిమానులు భావిస్తున్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్ కంటే ముందే పాకిస్థాన్ హాకీ సమాఖ్య తమ జూనియర్ జట్టుకు నో-హ్యాండ్‌షేక్ పరిస్థితికి సిద్ధంగా ఉండాలని చెప్పింది. భారత జట్టు హ్యాండ్‌షేక్ ఇవ్వడానికి నిరాకరిస్తే.. దానిని పట్టించుకోవద్దని తెలిపింది. భారత ఆటగాళ్లతో భావోద్వేగంగా ఎలాంటి వాదనకు లేదా ఘర్షణకు దిగొద్దని ఆదేశాలు జారీ చేసింది. కానీ మ్యాచ్ సమయంలో ఇరు జట్ల ప్లేయర్స్ హ్యాండ్‌షేక్ ఇచ్చుకున్నారు.

Exit mobile version