ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 త్వరలో ప్రారంభం కానుంది. ఖతార్ వేదికగా నవంబర్ 14 నుంచి టోర్నీ మొదలవనుంది. ఈ ఆసియా కప్ కోసం బీసీసీఐ సెలెక్టర్లు 15 మంది సభ్యులతో కూడిన భారత్ ఏ జట్టును ప్రకటించారు. టీ20 స్టార్ జితేశ్ శర్మ భారత జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. నమన్ ధిర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ స్టార్స్ ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహాల్ వధేరా, యశ్ ఠాకూర్, విజయ్‌కుమార్ వైశాఖ్, అభిషేక్ పోరెల్, సుయాంశ్ శర్మలు స్థానం సంపాదించుకున్నారు.
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 కోసం గుర్నూర్ సింగ్ బ్రార్, తనుష్ కోటిన్, కుమార్ కుశాగ్ర, సమీర్ రిజ్వీ, షేక్ రషీద్‌లు స్టాండ్ బై ఆటగాళ్లుగా ఉన్నారు. భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో నవంబర్ 14న యూఏఈని ఢీకొట్టనుంది. దాయాది పాకిస్థాన్‌తో నవంబర్ 16న మ్యాచ్ ఉంది. ఇక ఒమన్‌తో నవంబర్ 18న భారత్ తలపడనుంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఆసియా కప్ మాదిరే భారత్ ఆధిపత్యం చెలాయించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
భారత్ ఏ జట్టు:
వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య, నేహాల్ వధేర, సూర్యాంశ్ షెడ్జే, జితేశ్ శర్మ (కెప్టెన్, వికెట్ కీపర్), నమన్ ధిర్ (వైస్ కెప్టెన్), రమణ్‌దీప్ సింగ్, అశుతోశ్ శర్మ, యశ్ ఠాకూర్, హర్ష్ దూబె, గుర్జప్రీత్ సింగ్, యుధ్వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్ (కీపర్), విజయ్ కుమార్ వైశాఖ్, సుయాంశ్ శర్మ.
