India Captain Rohit Sharma React on New Zealand Batters: న్యూజిలాండ్ బ్యాటర్లు డారిల్ మిచెల్ (134; 119 బంతుల్లో 9×4, 7×6), కేన్ విలియమ్సన్ (69; 73 బంతుల్లో 8×4, 1×6) అద్భుతంగా ఆడారని, ఓ దశలో తమని బయపెట్టారని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మహమ్మద్ షమీ అద్బుతంగా బౌలింగ్ చేశాడు, అతడి వలెనే ఈ విజయం అని పేర్కొన్నాడు. లీగ్ దశలో 9 మ్యాచ్‌లు ఎలా ఆడామో, అలానే నాకౌట్ మ్యాచ్‌ల్లో సత్తాచాటాలని ముందే నిర్ణయించుకున్నామని రోహిత్ చెప్పాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో 70 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు దూసుకెళ్లింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన మొహ్మద్ షమీ (7/57)కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడుతూ… ‘వాంఖడేలో నేను చాలా క్రికెట్ ఆడాను. ఈ మైదానంలో భారీ స్కోర్ చేసినా.. రిలాక్స్‌గా ఉండలేం. వీలైనంత త్వరగా పనిని పూర్తి చేయాలి. ఈ మ్యాచ్‌లో ఒత్తిడి ఉంటుందని తెలుసు. ఫీల్డింగ్‌లో చిన్న చిన్న తప్పిదాలు చేసినా.. మేం ప్రశాంతంగానే ఉన్నాం. చివరకు విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. స్కోరింగ్ రేటు 9 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు.. వచ్చిన అవకాశాలను ఒడిపట్టాలి. కివీస్ అవకాశాలు ఇచ్చినా.. మేము వాటిని అందుకోలేకపోయాం. విలియమ్సన్, డారిల్ మిచెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వారిద్దరూ బ్యాటింగ్ చేస్తుంటే.. మేం ప్రశాంతంగానే ఉన్నాం. ప్రేక్షకులు కూడా సైలెంట్‌గా ఉండిపోయారు. ఒక్క వికెట్ పడినా మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చని మాకు తెలుసు’ అని అన్నాడు.
Also Read: Earthquake: ఉత్తరకాశీలో భూకంపం..రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.1గా నమోదు
‘మహమ్మద్ షమీ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. అతడి ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. జట్టులోని ఆటగాళ్లంతా ఫామ్‌లోనే ఉన్నారు. ముఖ్యంగా టాప్-5 బ్యాటర్లు చెలరేగుతున్నారు. ఈ టోర్నీలో శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. గిల్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అయితే దురదృష్టవశాత్తు అతను మైదానం వీడాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. తన ట్రేడ్‌మార్క్ ఇన్నింగ్స్‌తో సెంచరీ మార్క్ అందుకున్నాడు. మొత్తం మీద బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో బౌలర్లు సత్తాచాటారు. ఈ రోజు ఒత్తిడి లేదని నేను చెప్పను. సెమీ ఫైనల్ వంటి మ్యాచ్‌ల్లో ఒత్తిడి ఉంటుంది. లీగ్ దశ 9 మ్యాచ్‌లలో ఎలా ఆడామో అలానే నాకౌట్ మ్యాచ్‌ల్లో ఆడాలనుకున్నాం. అంతా బాగుంది’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.