NTV Telugu Site icon

IND vs NZ: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌.. రోహిత్‌ ముందు ఐదు రికార్డులు!

Rohit Sharma Test

Rohit Sharma Test

Rohit Sharma Records: బుధవారం (అక్టోబర్ 16) నుంచి భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా ఆడుతున్న టీమిండియా.. సొంతగడ్డపై ఈ సిరీస్‌ను సైతం ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. తొలి టెస్టు బెంగళూరులో, రెండో టెస్టు పుణెలో, మూడో టెస్టు ముంబైలో జరగనున్నాయి. ఈ సిరీస్‌లో భారత కెప్టెన్ రోహిత్‌ శర్మ ఐదు రికార్డులు బ్రేక్ చేసే అవకాశం ఉంది. అవేంటో ఓసారి చూద్దాం.

# రోహిత్‌ శర్మ మరో ఐదు సిక్స్‌లు బాదితే.. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ (91 సిక్స్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు.

# రెండు డబ్ల్యూటీసీల్లో 1000కి పైగా రన్స్ చేసిన తొలి భారత ఆటగాడిగా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ రికార్డు సృష్టించే అవకాశముంది. రోహిత్ 2019-21లో 1094 పరుగులు చేయగా.. 2023-25 డబ్ల్యూటీసీలో ఇప్పటివరకు 742 పరుగులు బాదాడు.

# న్యూజిలాండ్‌తో సిరీస్‌ను భారత్‌ 3-0తో కైవసం చేసుకుంటే.. డబ్ల్యూటీసీలో అత్యంత విజయవంతమైన టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ అరుదైన ఘనత సాధిస్తాడు. 2019-2022 మధ్య విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత్ 14 విజయాలు సాధించింది. ఈ సిరీస్‌ను భారత్ 3-0తో గెలిస్తే కోహ్లీని రోహిత్‌ దాటేస్తాడు.

Also Read: Pakistan Cricket: ఘన ప్రస్థానం నుంచి పతనం వైపు.. పాకిస్తాన్ క్రికెట్‌కు ఏమైంది?

# న్యూజిలాండ్‌పై మూడు టెస్టుల్లోనూ భారత్ విజయం సాధిస్తే.. టీమిండియా తరఫున నాలుగో అత్యుత్తమ విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టిస్తాడు. మహమ్మద్ అజహరుద్దీన్‌ (14 విజయాలు, 47 మ్యాచ్‌లు)ను హిట్‌మ్యాన్‌ అధిగమిస్తాడు. రోహిత్‌ ప్రస్తుతం 18 మ్యాచ్‌లలో 12 విజయాలతో ఉన్నాడు.

# న్యూజిలాండ్‌ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లో భారత్ గెలిస్తే.. కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేస్తాడు. దాదా (97 విజయాలు, 195 మ్యాచ్‌లు) నాలుగో స్థానంగా ఉండగా.. రోహిత్‌ (95 విజయాలు.. 128 మ్యాచ్‌లు) ఐదో స్థానంలో ఉన్నాడు.

Show comments