Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jacob Duffy: న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా బ్యాటర్లు అతడి బౌలింగ్‌లో పరుగుల వరద పారించారు. భారత తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 720 పరుగులు చేయగా.. ఇందులో డఫీ ఒక్కడే 201 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో టెస్టు క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో 200కు పైగా పరుగులు ఇచ్చిన న్యూజిలాండ్ తొలి బౌలర్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌లో డబుల్ సెంచరీ చేయకపోయినా.. బౌలింగ్‌లో మాత్రం డబుల్ సెంచరీతో వార్తల్లో నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో డఫీ 33 ఓవర్లు బౌలింగ్ చేసి 201 పరుగులు ఇచ్చాడు. అయితే భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వికెట్ మాత్రం అతడికి దక్కింది. న్యూజిలాండ్ తరఫున ఇతర ఫాస్ట్ బౌలర్లు కూడా భారీగా ఓవర్లు వేసినప్పటికీ.. డఫీ స్థాయిలో పరుగులు సమర్పించుకోలేదు. మాట్ హెన్రీ 33 ఓవర్లలో 94 పరుగులు, కైల్ జేమీసన్ 31 ఓవర్లలో 88 పరుగులు, నాథన్ స్మిత్ 29 ఓవర్లలో 84 పరుగులు ఇచ్చారు.
Also Read
- Ketireddy Vs JC: నా హత్యకు జేసీ కుట్ర..! కేతిరెడ్డి సంచలన ఆరోపణలు
- Kavya-Anirudh Reception: సీఎం విజయ్‌తో కలిసి రాని సంగీత.. అనిరుధ్-కావ్య రిసెప్షన్లో విడివిడిగా కనిపించిన దంపతులు
- Vande Bharat Brakes Fail: బ్రేకులు లేకుండానే 'వందే భారత్' 463 కి.మీ. ప్రయాణం.. రైల్వే అధికారుల నిర్లక్ష్యంపై విచారణ!
- AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు.. ఫేజ్-IIలో 25 వేల మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు
మొత్తంగా టెస్టు క్రికెట్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న ఫాస్ట్ బౌలర్ల జాబితాలో డఫీ ఆరో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ బౌలర్ ఖాన్ మహమూద్ అగ్రస్థానంలో ఉన్నాడు. 1958లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు 259 పరుగులు ఇచ్చాడు. అదే ఏడాది ఫజల్ మహమూద్ 247 పరుగులు సమర్పించుకున్నాడు. భారత దిగ్గజ బౌలర్ కపిల్ దేవ్ కూడా 1983లో పాకిస్థాన్‌పై 220 పరుగులు ఇచ్చాడు. ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఇయాన్ బోథమ్ 1987లో పాకిస్థాన్‌పై 217 పరుగులు సమర్పించుకున్నాడు. ఇంకా ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ 2004లో భారత్‌పై 201 పరుగులు ఇచ్చాడు. ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత అదే స్థాయిలో పరుగులు సమర్పించుకున్న ఫాస్ట్ బౌలర్‌గా జాకబ్ డఫీ ఈ జాబితాలో చేరాడు. అంతేకాకుండా న్యూజిలాండ్ తరఫున ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 200 పరుగులకు పైగా ఇచ్చిన తొలి బౌలర్‌గా చెత్త రికార్డు సృష్టించాడు.
మరోవైపు ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు చరిత్ర సృష్టించారు. తొలి ఇన్నింగ్స్‌లో 166 ఓవర్లు ఆడి 9 వికెట్ల నష్టానికి 720 పరుగులు చేసి డిక్లేర్ చేశారు. న్యూజిలాండ్ గడ్డపై ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో నమోదైన అత్యధిక స్కోరుగా ఇది నిలిచింది. భారత్, న్యూజిలాండ్ మధ్య 71 ఏళ్ల టెస్టు చరిత్రలోనూ ఇదే అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు. భారత్ తరఫున కేఎల్ రాహుల్ 136, రిషభ్ పంత్ 128 పరుగులు చేశారు. యశస్వి జైస్వాల్ 85, దేవదత్ పడిక్కల్ 80, శుభ్‌మన్ గిల్ 98, ధ్రువ్ జురెల్ 78 పరుగులతో రాణించారు. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 352 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
తాజావార్తలు
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
-
Ketireddy Vs JC: నా హత్యకు జేసీ కుట్ర..! కేతిరెడ్డి సంచలన ఆరోపణలు
-
Kavya-Anirudh Reception: సీఎం విజయ్‌తో కలిసి రాని సంగీత.. అనిరుధ్-కావ్య రిసెప్షన్లో విడివిడిగా కనిపించిన దంపతులు
-
Vande Bharat Brakes Fail: బ్రేకులు లేకుండానే ‘వందే భారత్’ 463 కి.మీ. ప్రయాణం.. రైల్వే అధికారుల నిర్లక్ష్యంపై విచారణ!
-
Cockroaches: ప్రకృతి రాసిన బొద్దింకల కథ!
ట్రెండింగ్
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!