Team India: ఒక్కరోజే 400 పరుగులు చేయగల టీమ్ కావాలి: గంభీర్
- అక్టోబరు 16 నుంచి టెస్టు సిరీస్
- టీమిండియా బ్యాటింగ్ తీరుపై గంభీర్ వ్యాఖ్యలు
- 100కే ఆలౌటయ్యే పరిస్థితి రావొచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir About Team India Batting: బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. మరో సిరీస్‌కు సిద్ధమవుతోంది. బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. బంగ్లాతో కాన్పూర్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. వర్షం కారణంగా రెండున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయినా.. రోహిత్ సేన దూకుడు కారణంగా అద్భుత విజయం సాధించింది. కివీస్‌తో సిరీస్‌లో కూడా అలానే ఆడతారా? అని అందరిలో ఆసక్తి నెలకొంది. న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ తీరుపై కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు.
టెస్టుల్లో టీమిండియాకు నిర్దిష్టంగా ఒక బ్యాటింగ్ స్టైల్ లేదని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. ‘మేం టెస్టుల్లో ఒక్కరోజే 400 పరుగులు చేయాలనుకుంటున్నాం. అవసరమైతే ఓటమి నుంచి తప్పించుకోవడానికి రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేయగల జట్టుగా ఉండాలని కోరుకుంటున్నాము. జట్టును ఆ విధంగా తయారు చేయడంపై మేం దృష్టి సారించాం. జట్టు అలా ఉంటేనే అసలైన టెస్ట్ క్రికెట్ మజా వస్తుంది. కొన్ని అద్భుతాలు కూడా జరుగుతాయి. భారత జట్టులో ఈ రెండింటినీ చేయగల బ్యాటర్లు ఉన్నారు. కొందరు దూకుడుగా ఆడటమే కాదు.. డిఫెన్స్ కూడా చేయగలరు’ అని గంభీర్ చెప్పాడు.
Also Read
Also Read: Wifi Password: పాస్‌వర్డ్‌తో పనిలేదు.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు!
‘ఒక్కరోజే 400 పరుగులు చేయడమంటే.. గెలవడం కోసమే. ఒకవేళ డ్రా కోసం ఆడాల్సిన పరిస్థితి వస్తే డిఫెన్స్ రెండో ఆప్షన్. సహజమైన ఆటను ఆడాలనుకునే క్రికెటర్లను మేం ప్రోత్సహిస్తాం. ఒక్కరోజులో 400-500 పరుగులు చేయగల ఆటగాళ్లను మనం ఎందుకు పక్కన పెట్టాలి. ఈ హై రిస్క్ తీసుకోవడానికి కారణం టీ20 క్రికెట్ అనే చెప్పాలి. టెస్టుల్లో అప్పుడప్పుడు 100కే ఆలౌటయ్యే పరిస్థితి రావొచ్చు. అప్పుడు డ్రా కోసం ఆడతాం’ అని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!