Tilak Varma: ఆ ఒక్క టెక్నిక్ ఫాలో అయ్యాను.. అందుకే విజయం సాధించాం: తిలక్ వర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ముందంజ వేసింది. ఒకానొక దశలో 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను తన అద్భుత బ్యాటింగ్‌తో గెలిపించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు తిలక్ వర్మ.
మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ మాట్లాడుతూ.. “వికెట్లు వరుసగా పడుతున్న సమయంలో చివరి వరకు క్రీజులో నిలబడాలనే ఆలోచించాను. మ్యాచ్‌కు ముందు కోచ్ గౌతమ్ గంభీర్, సితాంశు కోటక్ సర్ నాతో మాట్లాడారు. వారు నాపై, భారత ప్రజలపై ఉంచిన నమ్మకమే నన్ను నడిపించింది. చివరి వరకు నిలబడితే మ్యాచ్‌ను ఖచ్చితంగా గెలిపిస్తావని వారు చెప్పారు. నమన్ ధీర్‌తో కలిసి వికెట్ల మధ్య చురుగ్గా పరిగెత్తడం ద్వారా స్పిన్నర్లపై ఒత్తిడి తగ్గించాం. మ్యాచ్‌ను 18వ ఓవర్లోనే ముగించాలనుకున్నాం కానీ నమన్ దురదృష్టవశాత్తు అవుటయ్యాడు. ఆ తర్వాత మరో హైదరాబాద్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డితో కలిసి మ్యాచ్‌ను విజయవంతంగా పూర్తి చేయడం చాలా ఆనందంగా ఉంది. చివరి ఓవర్లలో పేసర్ల వేగాన్ని అనుకూలంగా మార్చుకుని సిక్సర్లు బాదాం” అని వెల్లడించాడు.
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో గన్ కల్చర్ కలకలం.. పంజాగుట్ట బార్లో రివాల్వర్‌తో బెదిరింపులు..
- Heavy Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
- Tilak Varma: మ్యాచ్ గెలిచిన తర్వాత వర్మ వినూత్న సెలబ్రేషన్స్.. కౌంటర్ మాములుగా ఇవ్వలేదుగా..
- Basit Ali: 'తిలక్ వర్మనే అసలైన హీరో'.. తెలుగు తేజంపై పాకిస్థాన్ మాజీ దిగ్గజం కీలక వ్యాఖ్యలు..
ఈ చారిత్రాత్మక విజయంతో పలు అరుదైన రికార్డులు నమోదయ్యాయి. అంతర్జాతీయ టీ20 ఛేజింగ్‌లో 7వ వికెట్ లేదా ఆపైన వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా తిలక్ వర్మ – నితీశ్ కుమార్ రెడ్డి (అజేయంగా 69 పరుగులు) నిలిచారు. అలాగే శ్రీలంకపై చామిక కరుణారత్నే, దాసున్ షనక నెలకొల్పిన 69 పరుగుల సమన్వయ రికార్డును వీరు సమం చేశారు. 70 లేదా అంతకంటే తక్కువ పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన తర్వాత 181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20లలో పూర్తి సభ్యత్వ దేశాల్లో ఇది రెండో అత్యధిక ఛేజింగ్‌గా రికార్డులకెక్కింది. 2026లో ఆఖరి ఓవర్లలో (16-20 ఓవర్లు) అత్యధిక స్ట్రైక్ రేట్ (231.52) కలిగిన బ్యాటర్‌గా తిలక్ వర్మ అగ్రస్థానంలో నిలిచి తన సత్తా చాటాడు.
తాజావార్తలు
-
Tilak Varma: ఆ ఒక్క టెక్నిక్ ఫాలో అయ్యాను.. అందుకే విజయం సాధించాం: తిలక్ వర్మ
-
Vivo S70: Visionox OLED డిస్ప్లే, 64MP కెమెరాతో Vivo S70 స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్!
-
Hyderabad: భాగ్యనగరంలో గన్ కల్చర్ కలకలం.. పంజాగుట్ట బార్లో రివాల్వర్‌తో బెదిరింపులు..
-
Heavy Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
-
Tilak Varma: మ్యాచ్ గెలిచిన తర్వాత వర్మ వినూత్న సెలబ్రేషన్స్.. కౌంటర్ మాములుగా ఇవ్వలేదుగా..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!