Site icon NTV Telugu

IND vs NZ: బాబోయ్ మళ్లీ వచ్చేశాడు.. నిలిచిన బెంగళూరు టెస్టు! 12 పరుగుల వెనుకంజలో భారత్

Ind Vs Nz Rain

Ind Vs Nz Rain

Rain in Bengaluru Chinnaswamy Stadium: బెంగళూరు వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌ వర్షం కారణంగా నిలిచిపోయింది. భారత్ ఇన్నింగ్స్ 71 ఓవర్ ముగిసిన అనంతరం చిరు జల్లు రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. ప్రస్తుతం చిన్నస్వామి స్టేడియంలో చినుకులు పడుతున్నాయి. ఒకవేళ వాతావరణం అనుకూలిస్తే.. మధ్యాహ్నం 12 గంటకు మ్యాచ్ తిరిగి ఆరంభం కానుంది.

Also Read: Gold Rate Today: మగువలకు బ్యాడ్‌న్యూస్.. వరుసగా నాలుగోరోజు పెరిగిన బంగారం ధరలు!

ప్రస్తుతం భారత్‌ 71 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 344 రన్స్ చేసింది. ఇంకా 12 పరుగులు వెనకబడి ఉంది. సర్ఫరాజ్‌ ఖాన్‌ (125), రిషబ్ పంత్‌ (53) క్రీజులో ఉన్నారు. నాలుగోరోజు ఆటలో సర్ఫరాజ్‌ 55 రన్స్ చేయగా.. పంత్‌ 53 రన్స్ చేశారు. ఈ ఇద్దరు కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో సెషన్‌లో కూడా సర్ఫరాజ్‌, పంత్‌ ఇలానే ఆడితే.. టీమిండియా మంచి ఆధిక్యం సాధించే అవకాశాలు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 46 రన్స్.. న్యూజిలాండ్‌ 402 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version