Site icon NTV Telugu

రో–కో దెబ్బకి 8 నిమిషాల్లోనే IND vs NZ తొలి వన్డే టికెట్స్ సోల్డ్ అవుట్..!

Ind Vs Nz

Ind Vs Nz

IND vs NZ: టీమిండియా జట్టును.. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ప్రత్యక్షంగా చూడాలనే అభిమానుల ఉత్సాహం మరోసారి రుజువైంది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్ (IND vs NZ 1st ODI) టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదలైన కొద్ది నిమిషాల్లోనే పూర్తిగా అమ్ముడుపోయాయి. 2026లో రోహిత్, కోహ్లీలు ఆడనున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే కావడం, అలాగే 2025 డిసెంబరులో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ తర్వాత వీరిద్దరూ కలిసి ఆడుతున్న తొలి మ్యాచ్ కావడం వల్ల ఆసక్తి మరింత పెరిగింది.

తక్కువ చార్జీలు, ప్రయాణికుల భద్రత లక్ష్యంగా ప్రభుత్వ కొత్త Bharat Taxi రైడ్–హైలింగ్ సేవ..!

జనవరి 1న బుక్‌మైషో వెబ్‌సైట్, యాప్‌లో IND vs NZ తొలి వన్డే టికెట్ల ఆన్‌లైన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అయితే కేవలం 8 నిమిషాల్లోనే అన్ని టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయని నివేదికలు వెల్లడించాయి. ఇది రోహిత్, కోహ్లీ జోడీకి ఉన్న అపారమైన అభిమానాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ టికెట్లే పూర్తిగా అమ్ముడుపోయినప్పటికీ.. ఆఫ్‌లైన్ టికెట్ల అమ్మకాల తేదీలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన తాజా సిరీస్‌లలో అద్భుతమైన ప్రదర్శనలతో రోహిత్–కోహ్లీ తమ ఫామ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. 2027 ప్రపంచకప్ విషయంలో సందేహాలు వ్యక్తం చేసిన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ వ్యాఖ్యలను కూడా వీరి ఆటతో తిప్పికొట్టారు.

న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును జనవరి 3న ప్రకటించనున్నారు. IND vs NZ 2026 పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది.

Akkineni Family : 2026లో అక్కినేని ఫ్యామిలీ నుండి డిఫరెంట్ జోనర్ మూవీస్

వన్డే సిరీస్:
తొలి వన్డే: జనవరి 11, ఆదివారం – బరోడా (13:30)

రెండో వన్డే: జనవరి 14, బుధవారం – రాజ్‌కోట్ (13:30)

మూడో వన్డే: జనవరి 18, ఆదివారం – ఇండోర్ (13:30)

టీ20 సిరీస్:
తొలి టీ20: జనవరి 21, బుధవారం – నాగ్‌పూర్ (19:00)

రెండో టీ20: జనవరి 23, శుక్రవారం – రాయ్‌పూర్ (19:00)

మూడో టీ20: జనవరి 25, ఆదివారం – గువాహటి (19:00)

నాలుగో టీ20: జనవరి 28, బుధవారం – విశాఖపట్నం (19:00)

ఐదో టీ20: జనవరి 31, శనివారం – తిరువనంతపురం (19:00)

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ మైదానంలోకి దిగనుండటంతో ఈ సిరీస్‌పై దేశవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version