Site icon NTV Telugu

IND vs NEP Playing 11: నేపాల్‌తో మ్యాచ్‌.. శార్ధూల్‌ ఠాకూర్‌పై వేటు! భారత తుది జట్టు ఇదే

Ind Vs Nep

Ind Vs Nep

India vs Nepal Asia Cup 2023 Predicted Playing 11: ఆసియా కప్‌ 2023లో భాగంగా శనివారం పాకిస్తాన్‌తో జరగాల్సిన భారత్ తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. దీంతో టీమిండియా ఖాతాలో ఒక్క పాయింట్‌ చేరింది. ఇక సెప్టెంబర్‌ 4న పసికూన నేపాల్‌తో రోహిత్ సేన తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సూపర్‌-4లో అడుగుపెట్టాలని భారత్ భావిస్తోంది. నేపాల్‌పై విజయం సాధిస్తే.. 3 పాయింట్లతో భారత్ సూపర్‌-4కు అర్హత సాధిస్తుంది. ఇప్పటికే 3 పాయింట్స్ ఉన్న పాక్ సూపర్‌-4కు అర్హత సాధించింది. నేపాల్‌ పసికూనే అయినా.. మ్యాచ్ కీలకం కాబట్టి పటిష్ట జట్టుతో బరిలోకి దిగాలని భారత్ చూస్తోంది.

పాకిస్తాన్‌ మ్యాచ్‌లో భారత టాపర్డర్‌ ఆట తీరు అందరినీ తీవ్రంగా నిరాశపరిచింది. స్టార్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, శుభమాన్ గిల్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. వారు తిరిగి ట్రాక్‌లోకి రావడానికి నేపాల్‌తో మ్యాచ్‌ మంచి అవకాశం అని చెప్పాలి. పాకిస్తాన్‌పై టాపర్డర్‌ విఫలమైనప్పటికీ.. హార్దిక్‌ పాండ్యా (87), ఇషాన్‌ కిషన్‌ (82) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇద్దరు మరోసారి చెలరేగాలని భావిస్తున్నారు.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మొహ్మద్ షమీని కాదని ఆల్‌రౌండర్‌ శార్థూల్‌ ఠాకూర్‌కు టీమ్ మెనేజ్‌మెంట్‌ అవకాశం ఇచ్చింది. అయితే మెనేజ్‌మెంట్‌ నమ్మకన్ని శార్ధూల్‌ నిలబెట్టకోలేకపోయాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌ చేసే ఛాన్స్‌ వచ్చినప్పటికీ.. 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. దాంతో నేపాల్‌తో మ్యాచ్‌కు శార్ధూల్‌ను పక్కన పెట్టి.. షమీని బరిలోకి దించాలని భారత జట్టు మెనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Also Read: Virat Kohli Fan: విరాట్ కోహ్లీ నా మ‌న‌సు గాయ‌ప‌రిచాడు: పాకిస్థాన్ యువతి

భారత తుది జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

 

 

Exit mobile version