IND vs NEP: నేపాల్‌పై ఘన విజయం.. ఆసియా క్రీడలు 2203 సెమీస్‌కు చేరిన భారత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Reach Asian Games 2023 Semis after Yashasvi Jaiswal Century: ఆసియా క్రీడలు 2203 పురుషుల క్రికెట్ విభాగంలో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. హాంగ్జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో మంగళవారం ఉదయం నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో యువ టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులే చేసింది. నేపాల్ బ్యాటర్లలో దీపేంద్ర సింగ్ ఐరీ (32) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్ తలో మూడు వికెట్స్ పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్స్ కోల్పోయి 202 స్కోరు చేసింది. యశస్వి జైస్వాల్ (100: 49 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీ చేశాడు. భారత్ ఇన్నింగ్స్‌ను యశస్వి ఘనంగా ఆరంభించాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అతడు.. 48 బంతుల్లో శతకం అందుకున్నాడు. తిలక్ వర్మ (2), జితేష్ శర్మ (5)లు నిరాశపరిచగా.. శివమ్ దూబె (25), రింకూ సింగ్ (37) చెలరేగారు. నేపాల్ బౌలర్లలో దిపేంద్ర సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు.
Also Read
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
- Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
- Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
Also Read: iPhone 13 on Amazon: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. ఆల్-టైమ్ తక్కువ ధరకే ‘ఐఫోన్ 13’!
అనంతరం లక్ష్య ఛేదనలో నేపాల్ 179/9 స్కోరుకే పరిమితమైంది. దీపేంద్ర సింగ్ ఐరీ (32) టాప్ స్కోరర్. ఓ పక్క వికెట్లు పడుతున్నా.. ఏమాత్రం బెదరకుండా నేపాల్ బ్యాటర్లు పోటీపడీ సిక్స్‌లు బాదేశారు. దాంతో ఒకానొక దశలో నేపాల్ చేతిలో భారత్‌కు ఓటమి తప్పదా? అన్న అనుమానం కలిగింది. అయితే కీలక సమయంలో బౌలర్లు రాణించడంతో టీమిండియా ఊపిరిపీల్చుకుంది. భారత బౌలర్లు అవేశ్ ఖాన్ 3, రవి బిష్ణోయ్ 3 వికెట్స్ తీయగా.. అర్ష్‌దీప్ సింగ్ 2, సాయి కిశోర్ ఒక వికెట్ తీశారు.
తాజావార్తలు
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
-
Ravindra Jadeja: జడేజాలో మైండ్ బ్లోయింగ్ చేంజ్.. సీక్రెట్ బయటపెట్టిన పుజారా..
-
Tamil Politics: కరుణానిధి, జయలలితకు తప్పలేదు.. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వంతు..
-
Dating Rumors: ప్రీతి జింటాతో ఎఫైర్ వార్తలు.. 15 ఏళ్ల తర్వాత మౌనం వీడిన స్టార్ ప్లేయర్!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!