NTV Telugu Site icon

IND vs NEP: భారత్‌తో మ్యాచ్‌.. నేపాల్ ఆటగాళ్లకు బంపరాఫర్!

Nepal Cricketers

Nepal Cricketers

Nepal Cricketers Have A Bumper Offer against India Match: ఆసియా కప్‌ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్‌, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. సూపర్-4 దశకు చేరాలంటే.. ఇరు జట్లు ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. భారత్ లాంటి పటిష్ట జట్టుపై విజయం సాధించడం నేపాల్‌కు కష్టమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్‌లో తమ ఆటగాళ్లను ఎంకరేజ్ చేసేందుకు నేపాల్‌కు చెందిన అర్ణ బీర్ కంపెనీ ఓ బంపరాఫర్ ప్రకటించింది. ఆ ఆఫర్ ఏంటో చూద్దాం.

భారత్‌తో మ్యాచ్‌లో నేపాల్ బౌలర్లు తీసే ప్రతి వికెట్‌కూ రూ. లక్ష రూపాయల నజరానాను అర్ణ బీర్ కంపెనీ ప్రకటించింది. కేవలం బౌలర్లకే కాదు.. బ్యాటర్లకూ ఆఫర్ ఇచ్చింది. భారత బౌలర్ల బౌలింగ్‌లో బాదే ఒక్కో సిక్సర్‌కు రూ. లక్ష బహుమతి ఇస్తానని తెలిపింది. ఫోర్ బాదితే మాత్రం రూ. 25 వేలు నజరానా అందిస్తామని పేర్కొంది. మ్యాచ్ అన్నాక వికెట్ పడడం.. ఫోర్, సిక్సర్‌లు పోవడం సాధారణమే. మొత్తానికి నేపాల్ ఆటగాళ్లపై కాసుల వర్షం కురవనుంది.

అయితే భారత్‌, నేపాల్ మ్యాచ్‌ పూర్తిగా జరిగే సూచనలు కనిపించడం లేదు. భారత్‌, పాకిస్తాన్ మ్యాచ్ లానే.. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో 60-70 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రెండో ఇన్నింగ్స్ సమయానికి వర్షం పడే అవకాశాలు పెరుగుతాయట. ఈ మ్యాచ్ కూడా భారత్-పాక్‌ మ్యాచ్ లాగే సగం జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి వరుణుడు ఏం చేస్తాడో చూడాలి.

Also Read: Heavy to Very Heavy Rains: వరుసగా ఐదు రోజులు భారీ వర్షాలు.. అన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్ జారీ..

ఒకవేళ నేపాల్‌తో మ్యాచ్ పూర్తిగా జరిగి భారత్ గెలిస్తే 3 పాయింట్లతో రోహిత్ సేన సూపర్-4కు చేరుకుంటుంది. నేపాల్ గెలిస్తే మాత్రం 2 పాయింట్లతో సూపర్-4కు చేరుతుంది. ఒకవేళ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిస్తే.. 2 పాయింట్లతో భారత్ సూపర్-4కు దూసుకెళుతుంది. నేపాల్ జట్టుపై విజయం సాధించిన పాకిస్తాన్.. ఇప్పటికే 3 పాయింట్లతో సూపర్-4కు చేరుకుంది.

Show comments