NTV Telugu Site icon

Jasprit Bumrah Record: ఏడాది తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే రెండో బౌలర్‌గా బుమ్రా అరుదైన రికార్డు!

Jasprit Bumrah Record

Jasprit Bumrah Record

Jasprit Bumrah Becomes 3rd Indian Bowler to take Highest Wickets in T20I: యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా.. 2022 సెప్టెంబర్‌ నుంచి 2023 ఆగష్టు వరకు భారత జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌ 2022, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023, ఐపీఎల్‌ 2023, డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023, వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. వెన్ను నొప్పి తిరగబెట్టడంతోనే దాదాపుగా 11 నెలలు అతడు ఆటకు దూరమయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో శస్త్రచికిత్స చేయించుకున్న బుమ్రా.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో రిహాబిలిటేషన్ తీసుకున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించి ఐర్లాండ్ టీ20 సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు.

ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జస్ప్రీత్ బుమ్రా ఐర్లాండ్ పర్యటనలో ఇప్పటివరకు ఆడిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టాడు. తొలి మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన యార్కర్ కింగ్.. 2వ టీ20 మ్యాచ్‌లో 2 వికెట్లు తీశాడు. రెండో టీ20 మ్యాచ్‌లో బుమ్రా తన 4 ఓవర్ల కోటాలో 15 పరుగులు ఇచ్చి 2 వికెట్స్ పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్ ఓవర్‌ కూడా ఉంది. అది కూడా ఇన్నింగ్స్ చివరిదైన 20వ ఓవర్. దాంతో బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరుపై లికించుకున్నాడు.

టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక మెయిడిన్ ఓవర్‌లు వేసిన రెండో బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు నెలకొల్పాడు. టీ20లలో బుమ్రా 10 మెయిడిన్ ఓవర్‌లు వేశాడు. ఈ జాబితాలో ఉగాండా బౌలర్ ఫ్రాంక్ న్సుబుగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఫ్రాంక్ ఏకంగా 15 మెయిడిన్ ఓవర్‌లు వేశాడు. మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ (10), జర్మనీ బౌలర్ గులాం అహ్మదీ (10)లు ఉన్నారు. ఆ తర్వాత 8 మంది ప్లేయర్స్ 6 మెయిడిన్ ఓవర్‌లు వేశారు.

Also Read: Asia Cup 2023: షాకింగ్ న్యూస్.. ఆసియా కప్ నుంచి శ్రేయాస్ అయ్యర్‌, కేఎల్ రాహుల్ ఔట్!

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్‌లను జస్ప్రీత్ బుమ్రా అధిగమించాడు. 80 మ్యాచుల్లో 96 వికెట్లు తీసిన యుజ్వేంద్ర చహల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచుల్లో 90 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో ఉన్న బుమ్రా 62 మ్యాచ్‌ల్లో 74 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ 92 మ్యాచుల్లో 73 వికెట్లు, అశ్విన్ 65 మ్యాచ్‌లు ఆడి 72 వికెట్లు పడగొట్టాడు.