IND vs IRE: మూడో టీ20లో వరుణుడిదే విజయం.. సిరీస్ భారత్ సొంతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs IRE 3rd T20 Match abandoned without a ball bowled: భారత్, ఐర్లాండ్ మధ్య బుధవారం జరగాల్సిన మూడో టీ20లో వరణుడు విజయం సాధించాడు. టాస్ కూడా పడకుండానే మూడో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో తొలి రెండు మ్యాచ్‌లలో గెలిచిన భారత్.. 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. మరోవైపు ఐర్లాండ్‌పై భారత్‌కు ఇది వరుసగా మూడో టీ20 సిరీస్ విజయం కావడం విశేషం. ఇక టీమిండియా ఆసియా కప్ 2023 ఆడేందుకు సిద్ధంగా ఉంది. ఆగష్టు 30న ఆసియా కప్ ఆరంభం కానుంది.
బుధవారం డబ్లిన్‌లో వర్షం తెరిపినివ్వకపోవడంతో మూడో టీ20లో టాస్ వేసే అవకాశం కూడా లేకుండా పోయింది. మ్యాచ్ ఆరంభ సమయం నుంచి మూడు గంటల తర్వాత వాన తగ్గడంతో అంపైర్లు మైదానాన్ని పరీక్షించారు. అయితే మైదానం చిత్తడిగా ఉండడంతో కనీసం 5 ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాదని తేల్చేశారు. ఐర్లాండ్ స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ రద్దుపై అంపైర్లు అధికారిక ప్రకటన చేశారు. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ రాత్రి 7.30 ఆరంభం కావాల్సి ఉండగా.. 11 గంటల ప్రాంతంలో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
Also Read
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
- Jay Shah: పాకిస్థాన్ కెప్టెన్‌తో 'జై షా' కరచాలనం.. ఏకిపారేస్తున్న నెటిజన్స్.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
Also Read: Gold Today Price: వరుసగా మూడోరోజు పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతుందంటే?
తొలి టీ20 కూడా వర్షం కారణంగా మధ్యలోనే ఆగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 2 పరుగుల తేడాతో నెగ్గింది. రెండో టీ20లో బుమ్రా సేన 33 పరుగుల తేడాతో గెలిచింది. 11 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసిన బుమ్రా.. బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు. రెండు మ్యాచ్‌ల్లో రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టడం ఈ సిరీస్‌లో భారత్‌కు అతి పెద్ద సానుకూలాంశం. ఆసియా కప్ 2023, ప్రపంచకప్ 2023 ముందు బుమ్రా ఫామ్ అందుకోవడం సంతోషించే విషయం.
The third T20I has been abandoned due to rain and wet ground conditions. India win the series 2-0. #TeamIndia #IREvIND pic.twitter.com/sbp2kWYiiO
— BCCI (@BCCI) August 23, 2023
తాజావార్తలు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
-
BharatPe Flex Feature: భారత్‌పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!