IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, ఐర్లాండ్ మధ్య బెల్ఫాస్ట్లో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్‌కు ఇది తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ కొత్త కెప్టెన్‌గా నియమితులవగా, దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చారు. ఈ సిరీస్ కోసం వైభవ్ సూర్యవంశీ, ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ శెడ్గే వంటి యువ ఆటగాళ్లకు తొలిసారిగా జట్టులో చోటు దక్కింది, అయితే మొదటి మ్యాచ్‌లో వైభవ్‌కు ఆడే అవకాశం రాలేదు.
ఈ మ్యాచ్ సాధారణ సమయం కంటే ఒక గంట ముందుగా, అంటే భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. జూన్ 28న లార్డ్స్‌లో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా మహిళల ప్రపంచకప్ కీలక మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని క్రికెట్ ఐర్లాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read
- Online Betting App Scam: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. బయటపడ్డ 200 షెల్ కంపెనీల నెట్వర్క్!
- Rohit Sharma All Time Record: రోహిత్ శర్మ ఆల్-టైమ్ రికార్డు డేంజర్లో ఉందా..? ఆ సత్తా ఎవరికి ఉంది?
- CM Revanth: అమర పోలీసుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా..!
- ED Raids: తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మెరుపు దాడులు.. 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు!
మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఐర్లాండ్ ఇన్నింగ్స్ ఆరంభం అంతగా సాగలేదు. రెండో ఓవర్లోనే ఓపెనర్ రాస్ అడైర్ 12 పరుగుల వద్ద వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో హ్యారీ టెక్టర్ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. మరో ఓపెనర్ టిమ్ టెక్టర్ 17 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. శివమ్ దూబే బౌలింగ్‌లో బెంజమిన్ కాలిట్జ్ 15 పరుగులకే అవుటయ్యాడు. అయితే ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ బాధ్యతాయుతంగా ఆడి 36 బంతుల్లో 50 పరుగులతో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. భారత బౌలర్ హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆఖర్లో గారెత్ డెలానీ 49 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు భారీ స్కోరు అందించాడు.
భారత జట్టులో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ బరిలోకి దిగారు. ఐర్లాండ్ జట్టులో టక్కర్, డోక్రెల్, మెక్‌కార్తీ, హంఫ్రీస్, జై ముంద్రా, హాలార్డ్ తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
-
Online Betting App Scam: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. బయటపడ్డ 200 షెల్ కంపెనీల నెట్వర్క్!
-
Rohit Sharma All Time Record: రోహిత్ శర్మ ఆల్-టైమ్ రికార్డు డేంజర్లో ఉందా..? ఆ సత్తా ఎవరికి ఉంది?
-
CM Revanth: అమర పోలీసుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా..!
-
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మెరుపు దాడులు.. 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి శుభవార్త.. రెండో టీ20లో బరిలోకి వైభవ్..
ట్రెండింగ్
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య