Site icon NTV Telugu

Virat Kohli: జోస్ బట్లర్‌ వల్లే విరాట్ కోహ్లీ త్వరగా ఔట్!

Virat Kohli

Virat Kohli

టీమిండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 5 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. గాయం కారణంగా మొదటి వన్డే ఆడని విరాట్.. రెండో వన్డేలో ఎనిమిది బంతులు ఎదుర్కొని అవుట్ అయ్యాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ బౌలింగ్‌లో కీపర్‌ ఫిల్‌ సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ముందుగా అంపైర్‌ నాటౌట్‌ ఇవ్వగా.. ఇంగ్లండ్‌ డీఆర్‌ఎస్ తీసుకుని సక్సెస్ అయింది.

Also Read: Viral Video: నీ మైండ్ ఏమైనా దొబ్బిందా?.. బౌలర్‌పై రోహిత్ శర్మ ఫైర్!

భారత్ ఇన్నింగ్స్‌లో అదిల్‌ రషీద్ వేసిన 20వ ఓవర్‌ మూడో బంతికి విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. అయితే అంతకుముందు రెండో బంతిని కోహ్లీ డ్రైవ్‌ ఆడగా.. నేరుగా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ చేతుల్లోకి వెళ్లింది. బట్లర్ బంతిని కీపర్ వైపు బలంగా విసిరాడు. ఆ బంతి విరాట్‌ వైపు వేగంగా దూసుకొచ్చింది. కోహ్లీకి కొద్దిదూరం నుంచే బంతి వెళ్లింది. వెంటనే సైగలు చేస్తూ కోహ్లీకి బట్లర్ క్షమాపణాలు చెప్పాడు. బట్లర్‌ నిర్వాహకం వల్లనే కోహ్లీ ఏకాగ్రతను కోల్పోయాడని ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version