IND vs ENG Test: ది ఓవల్ వేదికగా ప్రారంభమైన భారత్, ఇంగ్లాండ్ 5వ టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. మొదటి రోజు తొలి సెషన్ తర్వాత ఓపెనర్లను కోల్పోయిన భారత్ జట్టు 23 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్ ఆరంభించింది. భారత ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఇంగ్లాండ్ బౌలర్లు మంచి లెంగ్త్ తో రెచ్చిపోయారు. దీనితో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 9 బంతుల్లో 2 పరుగులు అవుట్ కాగా, తర్వాత KL రాహుల్ (14) కూడా ఎక్కువ సమయం క్రీజులో ఉండలేకపోయాడు.
OnePlus Independence Day Sale: ఆఫర్లే.. ఆఫర్లు! వన్ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్లో భారీ డిస్కౌంట్స్!
ఇక ప్రస్తుతం క్రీజ్ లో సాయ్ సుదర్శన్ 67 బంతుల్లో 25 పరుగులతో, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 23 బంతుల్లో 15 పరుగులతో ఉన్నారు. ఇద్దరూ పాత ట్రేడిషనల్ ఇంగ్లాండ్ పిచ్ పరిస్థితుల్లో నిలకడగా ఆడుతున్నారు. ఇకఇంగ్లాండ్ తరఫున క్రిస్ వర్క్స్, గుస్ అట్కిన్ సన్ చెరో ఒక వికెట్ తీసుకున్నారు. అయితే, మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం ప్రారంభమవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. ఆటగాళ్లు మైదానాన్ని విడిచి వెళ్లడంతో.. దీంతో కాస్త ముందుగానే లంచ్ బ్రేక్ తీసుకున్నారు. ఇకపోతే వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నేడు ఆటపై వర్ష ప్రభావం ఉండే అవకాశం ఎక్కువని తెలిపింది.
Trump Tariff Bomb: ట్రంప్ 25% టారిఫ్ బాంబు.. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, టెక్స్టైల్ రంగాలకు భారీ దెబ్బ!
