Narayan Jagadeesan is likely to replace Rishabh Pant: ఇంగ్లండ్‌తో సిరీస్‌లో టీమిండియాకు భారీ ఎదురు దెబ్బతగిలింది. గాయపడిన రిషబ్ పంత్ ఇక నాలుగో టెస్టులో కీపింగ్ చేయడు. గాయమైనప్పటికీ జట్టు కోసం పంత్ రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చాడు. మొదటి రోజు 37 పరుగుల వద్ద రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన అతడు.. రెండోరోజు బ్యాటింగ్‌కు వచ్చి 54 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. గాయమైన పాదానికి మూన్ బూట్ (ఆర్థోపెడిక్ బూట్) ధరించి వచ్చిన పంత్ అసౌకర్యంగా కనిపించాడు. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. తీవ్ర గాయమైనా జట్టు కోసం బ్యాటింగ్ చేసిన పంత్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.
అయితే రిషబ్ పంత్ ఐదవ టెస్టుకు దూరం కానున్నాడు. బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ.. జరిగేది ఇదే. పంత్ పాదంలో చీలిక వచ్చినట్లు స్కానింగ్‌లో తేలిందని తెలుస్తోంది. గాయం నుంచి కోలుకోవడానికి కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట. ఇక పంత్ సిరీస్‌లో ఆడే అవకాశం లేకపోవడంతో బీసీసీఐ సెలక్టర్లు ముందు జాగ్రత్త చర్యగా ఐదవ టెస్టు కోసం తమిళనాడు కీపర్ నారాయణ్ జగదీశన్‌ను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. జగదీశన్ 52 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 47.50 సగటుతో 3373 రన్స్ చేశాడు. గత రంజీ సీజన్‌లో674 పరుగులు బాదాడు. పంత్ స్థానంలో టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేస్తారని ముందుగా భావించారు. ఇషాన్ కూడా గాయంతో బాధపడుతుండడంతో జగదీశన్‌కు కలిసొచ్చింది.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
నాలుగో టెస్టులో రెండో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్ (94; 100 బంతుల్లో 13×4), జాక్ క్రాలీ (84; 113 బంతుల్లో 13×4, 1×6)లు ధాటిగా ఆడారు. క్రీజులో రూట్ (11), పోప్ (20) ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 264/4తో మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 358 పరుగులకు ఆలౌటైంది. ఇక మూడో రోజులో భారత్ బౌలర్లు చెలరేగే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. జస్ప్రీత్ బుమ్రా జట్టును ఆడుకుంటాడో చూడాలి.
