NTV Telugu Site icon

Ravindra Jadeja: అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఏళ్లు పూర్తి.. రవీంద్ర జడేజా స్పెషల్ వీడియో వైరల్!

Ravindra Jadeja

Ravindra Jadeja

Ravindra Jadeja celebrates 15 years in international cricket: ‘రవీంద్ర జడేజా’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మంచి బౌలర్, బ్యాటర్ మాత్రమే కాదు.. అత్యుత్తమ ఫీల్డర్ కూడా. ఫార్మాట్ ఏదైనా జడేజా భారత జట్టుకు తన ఆల్‌రౌండర్‌ సేవలు అందిస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ నేనున్నానంటూ ముందుకు వచ్చి ఎంతో బాధ్యతగా ఆడే జడేజా.. ఇప్పటికే ఎన్నో చిరస్మరణీయ విజయాలు టీమిండియాకు అందించాడు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ బెస్ట్ ఫీల్డర్ అయిన జడ్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మైదానంలో అపురూపమైన క్షణాలతో కూడిన వీడియోను రవీంద్ర జడేజా షేర్‌ చేశాడు. తన అరంగేట్రం నుంచి వన్డే ప్రపంచకప్ 2023 వరకు ఫొటోస్ చేశాడు. బ్యాట్, బంతి, ఫీల్డింగ్ విన్యాసాలను వీడియో చూడొచ్చు . ’15 ఏళ్లుగా నా కలలో జీవిస్తున్నా. ప్రతి క్షణానికి కృతజ్ఞతలు’ అని వీడియోకి క్యాప్షన్ ఇచ్చాడు. 15 సంవత్సరాల పాటు తాను టీమిండియాకు సేవలు అందించడం వెనుక తన కుటుంబసభ్యులు, స్నేహితులు, కోచ్‌లు, శ్రేయోభిలాషుల అండదండలు ఉన్నాయని.. అందరికీ తాను రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జడేజాకు అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు.

Also Read: IND vs ENG: టీమిండియాకు భారీ షాక్‌.. స్టార్‌ ప్లేయర్ దూరం!

2009లో శ్రీలంకపై తొలి వన్డేతో రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. ఇప్పటివరకు 69 టెస్టులు, 197 వన్డేలు, 66 టీ20లు ఆడిన జడేజా.. 6 వేలకు పైగా పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ అదరగొట్టిన జడేజా.. అన్ని ఫార్మాట్లలో కలిపి 553 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో రాణించిన జడేజా గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. మిగిలిన మూడు టెస్టులకు జట్టును ప్రకటించే ముందు గురువారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫిట్‌నెస్‌పై అప్డేట్ ఇచ్చాడు. తాను కోలుకుంటున్నానని, ఇప్పుడు బాగానే ఉన్నట్లు అతడు తెలిపాడు. మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా ప్రారంభం కానుంది.