Ravindra Jadeja: అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఏళ్లు పూర్తి.. రవీంద్ర జడేజా స్పెషల్ వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravindra Jadeja celebrates 15 years in international cricket: ‘రవీంద్ర జడేజా’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మంచి బౌలర్, బ్యాటర్ మాత్రమే కాదు.. అత్యుత్తమ ఫీల్డర్ కూడా. ఫార్మాట్ ఏదైనా జడేజా భారత జట్టుకు తన ఆల్‌రౌండర్ సేవలు అందిస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ నేనున్నానంటూ ముందుకు వచ్చి ఎంతో బాధ్యతగా ఆడే జడేజా.. ఇప్పటికే ఎన్నో చిరస్మరణీయ విజయాలు టీమిండియాకు అందించాడు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ బెస్ట్ ఫీల్డర్ అయిన జడ్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మైదానంలో అపురూపమైన క్షణాలతో కూడిన వీడియోను రవీంద్ర జడేజా షేర్ చేశాడు. తన అరంగేట్రం నుంచి వన్డే ప్రపంచకప్ 2023 వరకు ఫొటోస్ చేశాడు. బ్యాట్, బంతి, ఫీల్డింగ్ విన్యాసాలను వీడియో చూడొచ్చు . ’15 ఏళ్లుగా నా కలలో జీవిస్తున్నా. ప్రతి క్షణానికి కృతజ్ఞతలు’ అని వీడియోకి క్యాప్షన్ ఇచ్చాడు. 15 సంవత్సరాల పాటు తాను టీమిండియాకు సేవలు అందించడం వెనుక తన కుటుంబసభ్యులు, స్నేహితులు, కోచ్‌లు, శ్రేయోభిలాషుల అండదండలు ఉన్నాయని.. అందరికీ తాను రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జడేజాకు అందరూ కంగ్రాట్స్ చెబుతున్నారు.
Also Read
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
- POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
- 1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
Also Read: IND vs ENG: టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!
2009లో శ్రీలంకపై తొలి వన్డేతో రవీంద్ర జడేజా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. ఇప్పటివరకు 69 టెస్టులు, 197 వన్డేలు, 66 టీ20లు ఆడిన జడేజా.. 6 వేలకు పైగా పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ అదరగొట్టిన జడేజా.. అన్ని ఫార్మాట్లలో కలిపి 553 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో రాణించిన జడేజా గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. మిగిలిన మూడు టెస్టులకు జట్టును ప్రకటించే ముందు గురువారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫిట్‌నెస్‌పై అప్డేట్ ఇచ్చాడు. తాను కోలుకుంటున్నానని, ఇప్పుడు బాగానే ఉన్నట్లు అతడు తెలిపాడు. మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా ప్రారంభం కానుంది.
15 years of living my dream – grateful for every moment! 🇮🇳🏏 pic.twitter.com/IRiOnDWkj0
— Ravindrasinh jadeja (@imjadeja) February 8, 2024
తాజావార్తలు
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
ట్రెండింగ్
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!