Site icon NTV Telugu

IND vs ENG: జైస్వాల్‌కు బయపడి.. అంపైర్‌కు అబద్దం చెప్పిన ఇంగ్లండ్ కెప్టెన్! వీడియో వైరల్!

Ollie Pope Umpire

Ollie Pope Umpire

OlliePope Lies to Umpire to Avoid Yashasvi Jaiswal: లండన్‌లోని ‘ది ఓవల్’ మైదానంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ టెస్ట్ ఆసక్తికరంగా మారింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ 247 పరుగులు చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 23 పరుగుల లీడ్‌ సాధించింది. టీమిండియా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 52 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడో రోజు పూర్తిగా బ్యాటింగ్ చేసి.. ఇంగ్లండ్ ముందు 350 ప్లస్ టార్గెట్ ఉంచితే గిల్ సేన గెలవడం పెద్ద కష్టమేం కాదు. రెండో రోజు జైస్వాల్, గిల్, నాయర్ రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. అయితే రెండో రోజు ఆటలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.

రెండవ రోజు ఆట ముగియడానికి దాదాపు 15 నిమిషాల ముందు అంపైర్లు వెలుతురు తక్కువగా ఉందని చెప్పారు. ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్, అంపైర్ కుమార్ ధర్మసేన మధ్య సంభాషణ జరిగింది. వెలుతురు తక్కువగా ఉన్న నేపథ్యంలో పోప్‌కు అంపైర్లు స్పిన్ బౌలింగ్ చేయడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు. అందుకు ఇంగ్లండ్ కెప్టెన్ నిరాకరించాడు. దాంతో అంపైర్లు బయిల్స్ తీసేసి.. రెండో రోజు ముగిసినట్లు ప్రకటించారు. యశస్వి జైస్వాల్ అప్పటికే ధాటిగా ఆడుతూ పరుగులు చేస్తున్నాడు. దాంతో పోప్ పేసర్‌తో బౌలింగ్ చేయించాలనుకున్నాడు. అంపైర్లు స్పిన్నర్‌కు మాత్రమే అవకాశం ఇవ్వడంతో జైస్వాల్‌ బ్యాటింగ్‌కు బయపడిన పోప్ మ్యాచ్ ముగించేశాడు.

Also Read: IND vs ENG: కంగారుపడాల్సిన పడాల్సిన అవసరం లేదు.. ఓవల్‌లో మనం గెలవొచ్చు! హిస్టరీ ఇదే

ఇంగ్లండ్ జట్టులో జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్ స్పిన్ బౌలింగ్ చేయగలరు. స్పిన్నర్‌తో బౌలింగ్ చేయిస్తే యశస్వి జైస్వాల్ ఖచ్చితంగా ఆడుతాడని ఓలీ పోప్‌కు బాగా తెలుసు. ఆకాష్ దీప్ కూడా అప్పటికే బౌండరీ బాది ఊపుమీదున్నాడు. ఈ పరిస్థితిలో పోప్ మైదానం వదిలి వెళ్లడం మంచిదని భావించాడు. అంపైర్లు అడిగినప్పుడు తమకు స్పిన్నర్లు లేరని పోప్ చెప్పడం వీడియోలో వినిపించింది. ఆ తరువాత తాను జోక్ చేస్తున్నానని అన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘జైస్వాల్‌కు బయపడిన పోప్’, ‘అంపైర్‌కు అబద్దం చెప్పిన ఇంగ్లండ్ కెప్టెన్’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version