Site icon NTV Telugu

Lord’s Test: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో తెలుగోడి దెబ్బ.. వీడియో వైరల్!

Nitish Kumar Reddy

Nitish Kumar Reddy

ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌, భారత్‌ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి మెరిశాడు. ఓకే ఓవర్లో రెండు వికెట్స్ పడగొట్టి ఔరా అనిపించాడు. ఇన్నింగ్స్ 14 ఓవర్‌ మూడో బంతికి బెన్ డకెట్ (23) అవుట్ కాగా.. చివరి బంతికి జాక్ క్రాలీ (18) పెవిలియన్ చేరాడు. ఇద్దరు ఓపెనర్లు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చారు. రెండు వికెట్స్ పడగొట్టిన తెలుగు కుర్రాడిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ ఆచితూచి ఆడారు. టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను అడ్డుకుని పరుగులు చేశారు. 13 ఓవర్లు అయినా వికెట్ పడకపోవడంతో నితీష్ కుమార్ రెడ్డికి కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌ బంతిని అందించాడు. నితీశ్‌ తన తొలి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టాడు. ఓకే ఓవర్లో రెండు వికెట్స్ పడగొట్టి టీమిండియాకు శుభారంభం ఆడించాడు. తెలుగు కుర్రాడు నితీశ్‌ వికెట్లను సంబందించిన వీడీయో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: Jagan Mohan Rao: హెచ్‌సీఏ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. రూ.170 కోట్లు స్వాహా!

మూడో టెస్టులో మొదటి రోజు లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఇంగ్లండ్‌ 25 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ఓపెనర్లు జాక్‌ క్రాలీ (18), బెన్‌ డకెట్‌ (23) అవుట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో ఓలి పోప్‌ (12), జో రూట్‌ (24) ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి 5 ఓవర్లు వేసి 15 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా 8, ఆకాష్ దీప్ 7, మహమ్మద్ సిరాజ్ 5 ఓవర్లు వేశారు. దూకుడుగా ఆడుతున్న రూట్‌ను అవుట్ చేయాల్సి ఉంది.

Exit mobile version