Rohit-Kuldeep: రోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్ మధ్య తీవ్ర వాగ్వాదం.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma, Kuldeep Yadav Get Into Heated Argument Over DRS Call: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ ‘డబుల్ హ్యాట్రిక్’ నమోదు చేసింది. ఆదివారం లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. 230 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు 129 పరుగులకే ఆలౌట్ చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 రన్స్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (87) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
లక్ష్య ఛేదనలో కుల్దీప్ యాదవ్ వేసిన 22వ ఓవర్ 5వ బంతిని ప్రమాదకరమైన లియామ్ లివింగ్‌స్టోన్ ఎదుర్కొన్నాడు. లియామ్ బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించగా.. బాల్ అతడి ప్యాడ్‌ను తాకింది. భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఆన్-ఫీల్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ రివ్యూ తీసుకోలేదు. అటు టీమిండియా ప్లేయర్స్ కానీ.. ఇటు బౌలర్ కుల్దీప్ కానీ రోహిత్‌ను డీఆర్ఎస్ తీసుకోమని కోరలేదు. కుల్దీప్ కాన్ఫిడెంట్‌గా లేడు.. రోహిత్ శర్మకూ అదే చెప్పాడు. దాంతో రోహిత్ డీఆర్ఎస్ తీసుకోకుండా ఉండిపోయాడు.
Also Read
- Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
- High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
- ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
- CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
Also Read: Rohit Sharma: మేం 30 పరుగులు తక్కువ చేశాం.. మా బౌలర్లు సూపర్!
అయితే బిగ్ స్క్రీన్‌లోని రీప్లేలు బంతి ఇన్ పిచ్ అయి లెగ్-స్టంప్‌కు తగిలినట్లు చూపించాయి. రివ్యూ తీసుకుని ఉంటే.. లియామ్ లివింగ్‌స్టొన్ అవుట్ అయ్యేవాడు. అప్పటికీ భారత్ వద్ద రెండు రివ్యూలు ఉన్నాయి. రివ్యూ చూసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. బౌలర్ కుల్దీప్ యాదవ్ దగ్గరకు వెళ్లి ఫైర్ అయ్యాడు. బంతి వేసిన నీకు తెలియదా?.. రివ్యూ తీసుకోవాల్సిందని రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్ మాటలు వినడం తప్ప మరో మార్గం లేని కుల్దీప్ ఏమనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరోవైపు లియామ్ లివింగ్‌స్టోన్ బతికిపోయా అన్నట్లు ఓ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకుసంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— Nihari Korma (@NihariVsKorma) October 30, 2023
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!