Ashwin-Kuldeep: నువ్వు, నేను అంటూ.. అశ్విన్, కుల్దీప్ మధ్య చర్చ! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwin turns down touching 100th Test gesture from Kuldeep Yadav: ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ టెస్టులో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ మధ్య సరదాగా చర్చ జరిగింది. టీమ్‌ను లీడ్ చేస్తూ పెవిలియన్‌వైపు నడిచేందుకు ఇద్దరు నిరాకరించారు. చివరికి కుల్దీప్‌ను అశ్విన్ ఒప్పించాడు. దాంతో కుల్దీప్ టీమ్‌ను లీడ్ చేస్తూ పెవిలియన్‌వైపు నడిచాడు. ఇందుకుసంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆర్ అశ్విన్ వందో టెస్ట్ ఆడుతున్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 218 పరుగులకే ఆలౌట్ చేయడంలో కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లీష్ బ్యాటర్లను కోలుకోనీయలేదు. ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసిన అనంతరం పెవిలియన్‌కు వెళ్తుండగా.. వందో టెస్ట్ ఆడుతున్న అశ్విన్‌ను ముందుగా నడవమని సహచర ఆటగాళ్లు కోరారు. అయితే కుల్దీప్ 5 వికెట్లు తీయడంతో అశ్విన్ సహచరుల మాటను ఒప్పుకోలేదు. కుల్దీపే లీడ్ చేయాల్సిందిగా కోరాడు. బంతిని కూడా అతడికి ఇచ్చాడు.
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
Also Read: OTT Movies: ఓటీటీలోకి వచ్చిన మూడు హిట్ సినిమాలు.. అవేంటంటే?
ఆ బంతిని కుల్దీప్ యాదవ్ మరలా.. ఆర్ అశ్విన్‌కే విసిరాడు. ఇలా నువ్వు నేను అంటూ అశ్విన్, కుల్దీప్ మధ్య కాసేపు చర్చ జరిగింది. చివరికి కుల్దీప్‌ను అశ్విన్ ఒప్పించాడు. దాంతో కుల్దీప్ టీమ్‌ను లీడ్ చేస్తూ పెవిలియన్‌వైపు నడిచాడు. ఇందుకుసంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 100 టెస్ట్ ఆడుతూ, పైగా 500కు పైగా వికెట్లు తీసిన అశ్విన్ హుందాతనం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎంత ఎదిగినా ఒదగడం అశ్విన్‌ను చూసే నేర్చుకోవాలి అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
What a beautiful moment.
– The respect between Junior & Senior makes it iconic: Ashwin 🤝 Kuldeep. pic.twitter.com/ODShOoxa3O
— Johns. (@CricCrazyJohns) March 7, 2024
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!