NTV Telugu Site icon

Ashwin-Kuldeep: నువ్వు, నేను అంటూ.. అశ్విన్‌, కుల్దీప్‌ మధ్య చర్చ! వీడియో వైరల్

Ashwin Kuldeep

Ashwin Kuldeep

Ashwin turns down touching 100th Test gesture from Kuldeep Yadav: ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ టెస్టులో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ మధ్య సరదాగా చర్చ జరిగింది. టీమ్‌ను లీడ్‌ చేస్తూ పెవిలియన్‌వైపు నడిచేందుకు ఇద్దరు నిరాకరించారు. చివరికి కుల్దీప్‌ను అశ్విన్‌ ఒప్పించాడు. దాంతో కుల్దీప్‌ టీమ్‌ను లీడ్‌ చేస్తూ పెవిలియన్‌వైపు నడిచాడు. ఇందుకుసంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆర్ అశ్విన్‌ వందో టెస్ట్‌ ఆడుతున్న​ విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 218 పరుగులకే ఆలౌట్ చేయడంలో కుల్దీప్‌ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లీష్ బ్యాటర్లను కోలుకోనీయలేదు. ఇంగ్లండ్‌ను ఆలౌట్‌ చేసిన అనంతరం పెవిలియన్‌కు వెళ్తుండగా.. వందో టెస్ట్‌ ఆడుతున్న​ అశ్విన్‌ను ముందుగా నడవమని సహచర ఆటగాళ్లు కోరారు. అయితే కుల్దీప్‌ 5 వికెట్లు తీయడంతో అశ్విన్‌ సహచరుల మాటను ఒప్పుకోలేదు. కుల్దీపే లీడ్ చేయాల్సిందిగా కోరాడు. బంతిని కూడా అతడికి ఇచ్చాడు.

Also Read: OTT Movies: ఓటీటీలోకి వచ్చిన మూడు హిట్ సినిమాలు.. అవేంటంటే?

ఆ బంతిని కుల్దీప్‌ యాదవ్ మరలా.. ఆర్ అశ్విన్‌కే విసిరాడు. ఇలా నువ్వు నేను అంటూ అశ్విన్‌, కుల్దీప్‌ మధ్య కాసేపు చర్చ జరిగింది. చివరికి కుల్దీప్‌ను అశ్విన్‌ ఒప్పించాడు. దాంతో కుల్దీప్‌ టీమ్‌ను లీడ్‌ చేస్తూ పెవిలియన్‌వైపు నడిచాడు. ఇందుకుసంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 100 టెస్ట్‌ ఆడుతూ, పైగా 500కు పైగా వికెట్లు తీసిన అశ్విన్‌ హుందాతనం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎంత ఎదిగినా ఒదగడం అశ్విన్‌ను చూసే నేర్చుకోవాలి అంటూ ఫాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.

Show comments