NTV Telugu Site icon

Shubman Gill Catch: శుభ్‌మ‌న్‌ గిల్ సూపర్ డైవింగ్ క్యాచ్.. వీడియో వైరల్!

Shubman Gill Catch

Shubman Gill Catch

Shubman Gill Takes Stunning Catch in IND vs ENG 5th Test: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్టులో టీమిండియా బ్యాటర్ శుబ్‌మన్‌ గిల్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి.. డైవ్‌ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన ప్లేయర్స్, ఫాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్స్ గిల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘సూపర్ గిల్’, ‘గ్రేట్ క్యాచ్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఐదవ టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు జాక్‌ క్రాలే, బెన్ డక్కెట్‌ నిలకడగా ఆడారు. అయితే 18 ఓవర్‌లోని చివరి బంతిని మణికట్టు స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌ గుగ్లీగా సంధించగా.. బెన్‌ డకెట్‌ లాంగ్‌ ఆఫ్‌ మీదగా భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. షాట్‌ సరిగ్గా కనక్ట్‌ కాకపోవడంతో.. ఎక్స్‌ట్రా కవర్స్‌ దిశగా బంతి గాల్లోకి లేచింది. కవర్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న శుభ్‌మ‌న్‌ గిల్‌ పరిగెత్తుకుంటూ వెళ్లి.. డైవ్‌ చేస్తూ క్యాచ్‌ అందుకున్నాడు. దాంతో డకెట్‌ నిరాశగా పెవిలియన్ చేరాడు.

Also Read: IND vs ENG: లంచ్ బ్రేక్.. ఇంగ్లండ్‌ స్కోర్ 100/2!

తొలి రోజు ఆటలో రెండో సెషన్‌ ప్రారంభమైంది. క్రీజ్‌లోకి జో రూట్‌, జాక్ క్రాలే ఉన్నారు. 34 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 129 రన్స్ చేసింది. క్రాలే (75), రూట్‌ (13) పరుగులతో క్రీజులో ఉన్నారు. 26వ ఓవర్లో క్రాలే ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్‌ లెగ్‌లో సర్ఫరాజ్‌ ఖాన్ అందుకున్నా.. అంపైర్‌ ఔట్‌ ఇవ్వలేదు. భారత్ కెప్టెన్ రోహిత్‌ శర్మ రివ్యూకి వెళ్లకపోవడంతో క్రాలే బతికిపోయాడు. రివ్యూలో బంతి బ్యాట్‌కు తగిలినట్టు తేలింది.