IND vs ENG 5th Test Day 1 Lunch Break: ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో మొదటి సెషన్ పూర్తయింది. లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ 25.3 ఓవర్లలో 2 వికెట్స్ కోల్పోయి 100 రన్స్ చేసింది. లంచ్ బ్రేక్ ముందు ఓవర్లో ఓలీ పోప్ (11) ఔట్ అయ్యాడు. క్రీజులో జాక్ క్రాలే (61) ఉన్నాడు. అంతకుముందు 27 పరుగులు చేసిన బెన్ డకెట్ క్యాచ్ ఔట్ అయ్యాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు వికెట్స్ పడగొట్టాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డక్కెట్ నిలకడగా ఆడారు. క్రాలే వేగంగా ఆడగా.. డక్కెట్ నెమ్మదిగా ఆడాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు హాఫ్ సెంచరీ మార్కు దాటింది. 64 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన బెన్ డకెట్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. గిల్ పరుగెత్తికెళ్లి అద్భుత క్యాచ్ పట్టాడు. కాసేపటికి 100 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ఓలీ పోప్.. కుల్దీప్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. దాంతో లంచ్ విరామానికి ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది.