NTV Telugu Site icon

IND vs ENG: విశాఖ టెస్ట్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! రజత్‌ పటీదార్‌ అరంగేట్రం

Ind Vs Eng Toss

Ind Vs Eng Toss

IND vs ENG 2nd Test Playing 11: ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో విశాఖ వేదికగా రెండో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టెస్ట్ కోసం రోహిత్ మూడు మార్పులు చేశాడు. గాయాలతో జడేజా, రాహుల్ దూరం కాగా.. సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చారు. ముఖేష్, కుల్దీప్ రెండో టెస్టులో చోటు దక్కించుకోగా.. రజత్ పాటిదార్ అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. జాక్ లీచ్, మార్క్ వుడ్ స్థానంలో షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్ వచ్చారు.

తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో ఓడిన భారత జట్టు ఈ మ్యాచ్‌లో విజయం సాధించి.. సిరీస్‌లో పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు ఈ టెస్టులో గెలిచి సిరీస్‌పై పట్టుసాధించాలని ఇంగ్లండ్ చూస్తోంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఇరు జట్లు రెండోసారి తలపడనున్నాయి. అంతకుముందు 2016లో తలపడగా.. భారత్ 246 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మైదనంలో కెప్టెన్ రోహిత్ శర్మకు మంచి రికార్డు ఉంది.

తుది జట్లు:
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్(వికెట్‌కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్.
ఇంగ్లండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్‌), బెన్ ఫోక్స్(వికెట్‌ కీపర్‌), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్.