IND vs ENG: బర్మింగ్‌హామ్ లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజున టీమిండియా ఓ మోస్తారుగా మంచి స్థానంలో ఉందనే చెప్పవచ్చు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 85 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ కి హీరోగా నిలిచిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో జట్టును నడిపించాడు. ఇక మొదటి రోజు భారత బ్యాటింగ్‌కి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేఎల్ రాహుల్ కేవలం 2 పరుగులు చేసి ఔటయ్యాడు.
Read Also:Ather Rizta S: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సరి.. 159 కిమీ షురూ.. ఏథర్ రిజ్టా S కొత్త వెర్షన్ లాంచ్!
ఆ తర్వాత కరుణ్ నాయర్ (31), రిషభ్ పంత్ (25) నిలకడగా ఆడినా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. యశస్వి జైస్వాల్ మరో ఓపెనర్‌గా మరోసారి తనదైన మార్క్ బ్యాటింగ్ తో 87 పరుగులు చేసి సెంచరీకు దగ్గరగా వచ్చి ఔటయ్యాడు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి మాత్రం కేవలం 1 పరుగుకే పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. అయితే ఈ దశలో కెప్టెన్ గిల్, జడేజా కలిసి ఇన్నింగ్స్‌ను పునరుద్ధరించారు. ఇద్దరూ సుదీర్ఘ భాగస్వామ్యంను కొనసాగిస్తూ తొలి రోజు ఆటలో మరో వికెట్ కోల్పోకుండా ముగించారు. చివరకు క్రీజ్ లో గిల్ 114 పరుగులతో, జడేజా 41 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
Read Also:Piracy: టాలీవుడ్లో 40 సినిమాల పైరసీతో రూ.3700 కోట్ల నష్టం.. నిందితుడు అరెస్ట్
ఇది ఇలా ఉండగా.. ఇంగ్లాండ్ బౌలర్లు గిల్‌ను ఔట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. అయితే, 34వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన బ్రైడన్ కార్స్, గిల్ దృష్టిని మరల్చే ప్రయత్నం చేశాడు. బౌలింగ్‌కు పరిగెత్తుకొస్తూనే చేతి వేలితో మరోవైపు సైగ చేశాడు. ఇది బ్యాటర్ ఏకాగ్రతను దెబ్బతీయడానికి అనుకున్న పథకంగా కనిపించినా గిల్ మాత్రం ఆ ట్రాప్‌లో పడలేదు. బ్రైడన్ కార్స్ అలా చేయడంతో గిల్ వెంటనే వెన్నకు వెళ్లి బౌలర్ ను నిలదీశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Mind games or genuine distraction? We'll never know 🤷♂️#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/iIO2NH1HXR
— Sony Sports Network (@SonySportsNetwk) July 2, 2025