Jasprit Bumrah Bowling: బుమ్రా దెబ్బకు బ్యాట్ కిందపడేసిన స్టోక్స్.. వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ollie Pope Stuns with Jasprit Bumrah’s Yorker in IND vs ENG 2nd Test: విశాఖలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనంలో కీలకపాత్ర పోషించాడు. బుమ్రా దెబ్బకు ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌట్ అయింది. యార్కర్స్, స్వింగ్ బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ని పెవిలియన్‌కు పంపిన బంతి హైలెట్ అని చెప్పాలి. బుమ్రా దెబ్బకు స్టోక్స్ ఏకంగా బ్యాట్ కిందపడేశాడు. ఇందుకుసంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 50వ ఓవర్లో రెండో బంతిని బెన్ స్టోక్స్ ఎదుర్కొన్నాడు. కట్టర్ సంధించి స్టోక్స్‌ని బుమ్రా బోల్తా కొట్టించాడు. ఆఫ్ స్టంప్ దిశగా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని స్టోక్స్ డిఫెండ్ చేయబోయాడు. అయితే బంతి మిస్ అయి ఆఫ్ స్టంప్‌ని పడగొట్టింది. దీంతో స్టోక్స్ వెనక్కి కూడా చూడకుండా బ్యాట్ కింద పడేసి నిరాశతో క్రీజును వదిలివెళ్లాడు. ఈ వికెట్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. స్టోక్స్‌ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
అంతకుముందు 28వ ఓవర్లో ఓ అద్భుత యార్కర్‌తో తొలి టెస్ట్ సెంచరీ హీరో ఓలి పోప్‌ను ఔట్ చేశాడు. 28వ ఓవర్ ఐదవ బంతిని ఫుల్ లెంత్ యార్కర్ వేయగా.. పోప్ బోల్డ్ అయ్యాడు. ‘ఎలా ఆడాలి ఈ బంతిని?’ అన్నట్టుగా నిరాశతో అతడు పెవిలియన్ చేరాడు. ఈ వికెట్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 253 పరుగులకు ఆలౌట్ కావడంతో.. భారత్‌కు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెండోరోజు ఆట ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (13), యశస్వి జైస్వాల్ (15) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 171 రన్స్‌గా ఉంది.
THE DESTROYER OF ENGLAND – BUMRAH 🔥🤯pic.twitter.com/oeSPodRyax
— Johns. (@CricCrazyJohns) February 3, 2024
Yorker perfection from Jasprit Bumrah 🤩
(via @BCCI) #INDvENG pic.twitter.com/GqCsQVoADg
— ESPNcricinfo (@ESPNcricinfo) February 3, 2024
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!