IND vs ENG 1st ODI: టీ20 సిరీస్‌లో ఘోర పరాజయాన్ని ఎదురుకున్న టీమిండియా.. ఇప్పుడు వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకుందేందుకు అవకాశం దక్కింది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-4తో కోల్పోయిన భారత్.. ఇప్పుడు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పుంజుకోవాలని లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే నేడు (జూలై 14) బర్మింగ్‌హామ్ లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరగనుంది. 2027 వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ సిరీస్ ఇరు జట్లకూ కీలకం కానుంది.
వన్డే సిరీస్ షెడ్యూల్:
భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల సమయాలు ఒకేలా లేవు.
తొలి వన్డే: జూలై 14 – ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ – మధ్యాహ్నం 3:30 గంటలకు
రెండో వన్డే: జూలై 16 – సోఫియా గార్డెన్స్, కార్డిఫ్ – సాయంత్రం 5:30 గంటలకు
మూడో వన్డే: జూలై 19 – లార్డ్స్, లండన్ – మధ్యాహ్నం 3:30 గంటలకు
రోహిత్-విరాట్ మళ్లీ బరిలో:
ఈ వన్డే సిరీస్‌లో భారత అభిమానులకు మరో కీలక అంశం.. సుమారు 6 నెలల విరామం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ కలిసి వన్డే జట్టులో ఆడనున్నారు. అలాగే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ ఫార్మాట్‌లో తిరిగి జట్టులోకి రావడం భారత్‌కు పెద్ద బలంగా మారింది.
మరోవైపు తొలి వన్డేకు ముందు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ ప్లేయింగ్ XIను అధికారికంగా ప్రకటించి ఆశ్చర్య పరిచింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని జట్టులో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. భారత బౌలింగ్ దాడిని ఎదుర్కొనేందుకు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ జాకబ్ బెతెల్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేసింది. అతడు బెన్ డకెట్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. సీనియర్ ప్లేయర్ జో రూట్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. మరోవైపు స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ మిడిల్ ఆర్డర్‌లో ఆడనున్నాడు. ఈ మ్యాచ్ బట్లర్‌కు 200వ వన్డే అంతర్జాతీయ మ్యాచ్. ఇంగ్లండ్ తమ బౌలింగ్ విభాగాన్ని కూడా బలంగా తీర్చిదిద్దింది. జోఫ్రా ఆర్చర్, సామ్ కరన్, జోష్ టంగ్ పేస్ బాధ్యతలు చేపట్టనుండగా, స్పిన్ విభాగంలో ఆదిల్ రషీద్, విల్ జాక్స్, లియామ్ డాసన్కు అవకాశం కల్పించింది.
ఇంగ్లండ్ తొలి వన్డే ప్లేయింగ్ XI:
జాకబ్ బెతెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్ (C), జోస్ బట్లర్ (W), సామ్ కరన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్
టీమిండియా తొలి వన్డే ప్లేయింగ్ XI:
శుభ్‌మన్ గిల్ (C), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (VC), కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్.
T20 series whitewash ✅
Now onto the ODIs, and we start in Birmingham!
— England Cricket (@englandcricket) July 13, 2026

