NTV Telugu Site icon

Virat Kohli Bat: బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌కు విరాట్‌ కోహ్లీ బ్యాట్‌!

Kohli Bat Shakib

Kohli Bat Shakib

Virat Kohli Gifts His bat to Shakib Al Hasan: బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌కు భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తన బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చాడు. మంగళవారం కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌తో ముగిసిన రెండో టెస్టు మ్యాచ్ అనంతరం షకిబ్‌ దగ్గరకు వెళ్లిన విరాట్‌.. సంతకం చేసిన తన బ్యాట్‌ను అతడికి అందించాడు. ఆపై ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. కోహ్లీ బ్యాట్‌తో షకిబ్‌ షాడో సాధన చేశాడు.

స్వదేశంలో వీడ్కోలు పలికే అవకాశం లభిస్తే ఓ టెస్టు మ్యాచ్‌ ఆడతానని, లేదంటే కెరీర్లో కాన్పూర్‌ టెస్ట్ మ్యాచ్‌ తనకు ఆఖరిదని షకిబ్‌ అల్‌ హసన్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. షకిబ్‌ భారతదేశంలో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడేశాడు. ఇది అతడి కెరీర్‌లో 70వ మ్యాచ్‌. బంగ్లాలో రాజకీయ ఉద్రిక్తతల కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగే టెస్ట్ మ్యాచ్‌లో షకిబ్‌ ఆడతాడా లేదా అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. ఇక వచ్చే ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత షకిబ్‌ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికే అవకాశం ఉంది. బంగ్లా తరఫున ఈ ఆల్‌రౌండర్‌ 70 టెస్టులు, 247 వన్డేలు, 129 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్‌లలో కలిపి 14 శతకాలు చేశాడు.

Show comments