IND vs BAN U19: బులావాయో వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల అండర్-19 ప్రపంచకప్ గ్రూప్–B లీగ్ మ్యాచ్‌లో భారత్ అండర్-19 జట్టు విజయాన్ని నమోదు చేసింది. వర్షం ప్రభావంతో డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ (DLS) పద్ధతిలో నిర్ణయించిన లక్ష్యాన్ని బంగ్లాదేశ్ అండర్-19 జట్టు చేధించలేకపోయింది. ఫలితంగా భారత్ 18 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 49 ఓవర్లలో 48.4 ఓవర్లకు 238 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. 67 బంతుల్లో 72 పరుగులు చేసిన వైభవ్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. మరోవైపు అభిగ్యాన్ కుందు నిలకడగా ఆడి 112 బంతుల్లో 80 పరుగులు సాధించి టీంకు అవసరమైన పరుగులను అందించాడు. చివర్లో కనిష్క్ చౌహాన్ 28 పరుగులతో వేగం పెంచాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ ఫహాద్ మెరిశాడు. 9.2 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను కట్టడి చేశాడు.
Peddi-Paradise: బాక్సాఫీస్ దగ్గర సస్పెన్స్.. మార్చి రేసు నుండి చరణ్, నాని అవుట్?
ఆ తర్వాత వర్షం కారణంగా బంగ్లాదేశ్‌కు 29 ఓవర్లలో 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. చేధనలో అజిజుల్ హకీమ్ 51 పరుగులు చేసినా, మిగతా బ్యాటర్లు భారత బౌలింగ్ ముందు మిగితా బ్యాటర్లు నిలవలేకపోయారు. కీలక దశలో విహాన్ మల్హోత్రా అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను భారత్ వైపుకు తిప్పాడు. 4 ఓవర్లలో కేవలం 14 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ పతనానికి కారణమయ్యాడు. ఫీల్డింగ్‌లో రెండు క్యాచ్‌లు కూడా అందుకున్నాడు. మల్హోత్రా ఆల్‌రౌండ్ ప్రదర్శనకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
