NTV Telugu Site icon

IND vs BAN Test: ముగిసిన భారత్ మొదటి ఇన్నింగ్స్.. 376 ఆలౌట్..

India

India

IND vs BAN Test: భారత జట్టు తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. శుక్రవారం ఆరు వికెట్లకు 339 పరుగుల వద్ద ఆట ప్రారంభించిన టీమిండియా 37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. భారత జట్టు శుక్రవారం ఒక్క గంట ఆటకే పరిమితమైంది. రెండో రోజు రెండో ఓవర్ తొలి బంతికే రవీంద్ర జడేజా పెవిలియన్‌కు చేరుకున్నాడు. రవీంద్ర జడేజా వికెట్‌ను తస్కిన్ అహ్మద్ తీయగా 86 పరుగులు చేసిన తర్వాత రవీంద్ర జడేజా ఇన్నింగ్స్ ముగించాడు. ఆ తర్వాత వచ్చిన ఆకాశ్‌దీప్ కూడా 30 బంతుల్లో 17 పరుగులు చేసి తస్కిన్ అహ్మద్ బంతికి ఔటయ్యాడు.

South Telangana Project: నేడు పెండింగ్ ప్రాజెక్ట్ లపై మంత్రుల సమీక్ష..

ఆ తర్వాత అద్భుత ప్రదర్శన చేసి 133 పరుగులు చేసిన ఆర్. అశ్విన్ కూడా పెవిలియన్‌కు చేరుకున్నాడు. అశ్విన్ తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో బంగ్లా కెప్టెన్ శాంటోకి క్యాచ్ ఇచ్చి అశ్విన్ ఔటయ్యాడు. అశ్విన్ ఔట్ అయిన తర్వాత స్టేడియంలోని ప్రజలు మొత్తం లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఇక చివరగా జస్ప్రీత్ బుమ్రా 9 బంతుల్లో 1 ఫోర్ సాయంతో 7 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకోవడంతో భారత్ ఇన్నింగ్స్ కు తెరపడింది. ఇక హసన్ మహమూద్ 5 వికెట్లతో రెచ్చిపోయాడు. ఒక బంగ్లాదేశ్ బౌలర్ ఇండియాలో జరిగిన టెస్ట్ లో 5 వికెట్స్ తీసుకోవడం ఇదే ప్రథమం.

Show comments