NTV Telugu Site icon

Hardik Pandya: బంగ్లా చిన్న జట్టు.. హార్దిక్ విషయంలో అత్యుత్సాహం వద్దు: ఆర్పీ సింగ్

Hardik Pandya

Hardik Pandya

గ్వాలియర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీమిండియా విజయంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో 16 బంతుల్లో 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పేస్ బౌలింగ్‌లో నో బ్యాక్‌ లుక్ షాట్‌తో హార్దిక్‌ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. ఇక బౌలింగ్‌లో నాలుగు ఓవర్ల కోటాలో ఒక వికెట్ తీసి 26 రన్స్ ఇచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌ ప్రదర్శన ఆదారంగా హార్దిక్ ఫామ్‌ను అంచనా వేయవద్దని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ అంటున్నాడు.

జియో సినిమాలో ఆర్పీ సింగ్ మాట్లాడుతూ… ‘బంగ్లాదేశ్‌ లాంటి చిన్న జట్టుతో ఆడినప్పుడు ఆటగాడి ప్రదర్శనను జడ్జ్‌ చేయడం సరైంది కాదని నా అభిప్రాయం. బంగ్లా ఎలా ఆడుతుందో అందరం చూస్తున్నాం. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడం లేదు. ఇక్కడ హార్దిక్‌ పాండ్యాను తక్కువ చేయడం లేదు. అతడు అత్యుత్తమ ప్లేయర్. గతంలో ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఎన్నో ఆడాడు, ఆడగలడు కూడా. అయితే బంగ్లాపై విభిన్నమైన షాట్లను ఆడడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అసలైన పరీక్ష పటిష్ట జట్టు ఎదురైనప్పుడే ఉంటుంది. ఈజీగా మ్యాచ్‌ గెలుస్తున్నామని తెలిసినప్పుడు ఓ బ్యాటర్ మరింత స్వేచ్ఛగా షాట్స్ ఆడుతాడు. ఒత్తిడి ఉన్నప్పుడే అసలు ఆట ఏంటో తెలుస్తుంది. బంగ్లా ఏ దశలోనూ టీమిండియాకు సవాల్ విసరలేదు’ అని అన్నాడు.

Also Read: IPL 2025-DC: అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు జాక్‌పాట్.. ఢిల్లీ రిటైన్ లిస్ట్ ఇదే!

‘హార్దిక్‌ పాండ్యా కొట్టిన ఫోర్, సిక్స్‌ ఇక్కడ విషయం కాదు. హార్దిక్‌ నాలుగు ఓవర్లు బాగా బౌలింగ్ చేశాడు. బ్యాటింగ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. గతంలో హార్దిక్‌ తన పూర్తికోటా ఓవర్లను వేయలేకపోయాడు. ఇప్పుడు అలవోకగా వేస్తున్నాడు. ఇది మనకు గుడ్‌న్యూస్. హార్దిక్‌ తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. కానీ రాబోయే సిరీసుల్లోనూ రాణిస్తేనే.. అతడిపై ఓ అంచనాకు వస్తే బాగుంటుంది. హార్దిక్ విషయంలో అత్యుత్సాహం వద్దు’ అని ఆర్పీ సింగ్ వివరించాడు.