Basit Ali Huge Praises on Pat Cummins: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తెలుగు ఆటగాడు నితీశ్‌కుమార్ రెడ్డి సత్తాచాటాడు. బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ (74; 34 బంతుల్లో 4×4, 7×6) చేసిన నితీశ్.. బౌలింగ్‌లో రెండు వికెట్లు (2/23) పడగొట్టాడు. మరోవైపు ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ (15; 11 బంతుల్లో 3×4,) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. గత సిరీస్‌లో అభిషేక్ మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ ఇద్దరు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2024లో నితీశ్, అభిషేక్‌లు అదరగొట్టారు. వీరి సక్సెస్‌కు కారణం పాట్ కమిన్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ కూడా ఇదే అంటున్నాడు.
Also Read: Konda Surekha-KTR: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్!
బసిత్ అలీ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ… ‘పాట్ కమిన్స్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. అభిషేక్ శర్మ, నితీశ్‌కుమార్ రెడ్డిలు ఐపీఎల్‌లో విజయవంతం కావడానికి అతడిదే కీలక పాత్ర. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ అయిన కమిన్స్.. ఐపీఎల్ 2024లో ఈ ఇద్దరికీ ఎక్కువగా అవకాశాలు ఇచ్చాడు. ఓపెనర్‌గా అభిషేక్ నుంచి భారీ ఇన్నింగ్స్ వచ్చాయి. ట్రావిస్ హెడ్‌తో కలిసి సూపర్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. నితీశ్ కూడా బాగా ఆడాడు. మిడిల్ ఓవర్లలో బౌలింగ్ ఇచ్చి ఆల్‌రౌండర్‌గా ఎదిగేందుకు సాయపడ్డాడు. బంగ్లాదేశ్‌పై నితీశ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు’ అని చెప్పాడు.